Republic Telugu Movie Teaser: టాలీవుడ్ నటుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటేస్ట్ సినిమా రిపబ్లిక్. విలక్షణ చిత్రాల దర్శకుడైన దేవా కట్టా (Deva Katta) రిపబ్లిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్ అనంతరం సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా ఈ సినిమాను ప్రారంభించారు. సీనియర్ నటీనటులు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తన కెరీర్‌లోనే తొలిసారి పొలిటికల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. రిపబ్లిక్ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్ ప్రముఖ దర్వకుడు సుకుమార్ నేటి ఉదయం పవర్ ఫుల్ మూవీ రిపబ్లిక్ టీజర్‌ను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సరసన ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా జత కట్టింది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా రిపబ్లిక్ సినిమాను నిర్మిస్తున్నాయి. జె.భగవాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read: Vakeel Saab రిలీజ్ డేట్ సమీపిస్తుండగా Nivetha Thomas కి కరోనా పాజిటివ్
రిపబ్లిక్ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల(Republic release date) కానుంది. ‘ప్రజాస్వామ్యంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియక ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్, కోర్టులు ఆ రూలర్స్ కింద బానిసల్లా బతుకుతున్నారు. వ్యవస్థ పునాదులై కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే’ అంటున్నాడు సాయి ధరమ్ తేజ్.
Also Read: Sulthan movie review: సుల్తాన్ మూవీ రివ్యూ, రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Republic Teaser: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ టీజర్ విడుదల, పవర్ ఫుల్ కాన్సెప్ట్