Viral Video: సోషల్ మీడియా సెన్సేషన్‌గా మరో Chaiwala, అందులోనూ రజనీకాంత్‌కు వీరాభిమాని

Viral Video Of Chaiwala : రెండేళ్ల కిందట ఓ టీకొట్టు వర్కర్ ఏకంగా సినిమా ఛాన్స్ సైతం అందుకున్నాడు. తాజాగా మరో ఛాయ్‌వాలా ఇంటర్నెట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 18, 2021, 06:21 PM IST
  • చేసే పనిలో విలక్షణత ఉంటే గుర్తింపు పొందడం సాధ్యం
  • తాజాగా ఓ ఛాయ్‌వాలా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు
  • తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని అని ఛాయ్‌వాలా చెబుతున్నాడు
Viral Video: సోషల్ మీడియా సెన్సేషన్‌గా మరో Chaiwala, అందులోనూ రజనీకాంత్‌కు వీరాభిమాని

Viral Video Of Tea Seller From Nagpur Serves Chai With A Twist : చేసే పనిలో విలక్షణత ఉంటే గుర్తింపు పొందడం లేదా సెలబ్రిటీగా మారిపోవడం ఈరోజుల్లో చాలా తేలిక అయిపోయింది. ఛాయ్‌వాలాలు ఇంటర్నెట్ సెన్సేషన్ అవుతున్నారు. రెండేళ్ల కిందట ఓ టీకొట్టు వర్కర్ ఏకంగా సినిమా ఛాన్స్ సైతం అందుకున్నాడు. తాజాగా మరో ఛాయ్‌వాలా ఇంటర్నెట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నాడు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్టైలిష్ ఛాయ్‌వాలా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. ‘డాలి కి టప్రి’ అనే టీకొట్టు ఛాయ్‌వాలా వీడియో(Viral Video)ను స్ట్రీట్ ఫుడ్ రెసిపిస్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా మిలియన్ల వ్యూస్, కామెంట్స్, లైక్స్ వచ్చాయి. తనదైన స్టైల్‌లో ఛాయ్ తయారుచేసి, సర్వ్ చేయడం, డబ్బులు కలెక్ట్ చేయడం అతడి ప్రత్యేకతను చాటుతున్నాయి.

Also Read: WhatsApp: వాట్సాప్ ప్రైవసీ వివాదం, ఏకంగా Delete వాట్సాప్ ఆప్షన్‌ను‌ మాయం చేస్తుంది

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth)‌కు తాను అభిమాని అని, ఆయన సినిమాలు చూస్తుంటానని స్టైలిష్ ఛాయ్‌వాలా డాలి తెలిపాడు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు టీ విక్రయిస్తుంటానని 20 ఏళ్లుగా ఈ పని చేస్తున్నానని చెప్పాడు. చేసే పనిలో విలక్షణత ఉంటే ఎవరైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారవచ్చునని ఛాయ్‌వాల్ డాలీ మరోసారి నిరూపించాడు.

Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News