How To Delete Your WhatsApp Account: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురానుంది. అయితే తమ డేటా మొత్తం తీసుకెళ్లి దాని మాతృసంస్థ ఫేస్బుక్(Facebook)కు ఇవ్వనున్నట్లు కొత్త పాలసీలో స్పష్టం చేసింది. దీంతో వాట్సాప్ వినియోగదారులు సంస్థ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమ సమాచారాన్ని వాడుకుంటామని చెప్పే యాప్ మాకెందుకు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌నకు ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం వేట మొదలుపెట్టారు. ఇదివరకే కొందరు నెటిజన్లు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసి వాడుతుండగా.. తాజాగా సిగ్నల్ యాప్ డౌన్లోడ్స్ పెరిగిపోతున్నాయి. కొందరు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మరికొందరు నెటిజన్లు తమ డేటా భద్రతకు భంగం వాటిల్లకూడదని వాట్సాప్(WhatsApp) ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేసిస్తున్నారు.
Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే.. ఓ విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మీరు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశారంటే తిరిగి ఆ అకౌంట్‌ను మీరు పొందలేరని తెలుసుకోండి. దీనిపై సోషల్ మీడియా(Social Media) యాప్ వాట్సాప్ ఇదివరకే స్పష్టత ఇచ్చింది.
Also Read: Cheapest Data Plans: ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..
- మొదట మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.
- అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆపై అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
- పేజీ ఓపెన్ అయ్యాక.. అందులో డిలీట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత సూచనల మేరకు మీరు వాట్సాప్ వాడుతున్న మొబైల్ నెంబర్‌ను అంతర్జాతీయ ఫార్మాట్(+91)లో టైప్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై క్లిక్ చేస్తే.. పర్మనెంట్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అవుతుంది.
మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేస్తే మీ చాటింగ్ హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. మీరు భాగస్వాములు అయి ఉన్న వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సైతం రిమూవ్ అవుతారు. ఇప్పటివరకూ మీరు చేసిన గూగుల్ బ్యాకప్ డేటా సైతం డిలీట్ అయిపోతుంది.
Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook