భారత్ వెళ్లే చైనీయుల్లారా.. తస్మాత్ జాగ్రత్త..!

భారతదేశాన్ని సందర్శించాలని భావించే చైనీయులు జాగరూకతలో వ్యవహరించాలని న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ ప్రకటన జారీ చేసింది.

Last Updated : Dec 28, 2017, 05:31 PM IST
భారత్ వెళ్లే చైనీయుల్లారా.. తస్మాత్ జాగ్రత్త..!

భారతదేశాన్ని సందర్శించాలని భావించే చైనీయులు జాగరూకతలో వ్యవహరించాలని న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ ప్రకటన జారీ చేసింది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో చైనీయుల పట్ల కేసులు పెచ్చుమీరిపోతున్నాయని.. అందుకే భారత్ సందర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. పలు నిషేదిత ప్రాంతాలకు వెళ్లవద్దని.. అలాగే అక్కడి చట్టాలను కూడా ఉల్లఘించవద్దని ఎంబసీ తెలిపింది.

మాండరిన్ భాషలో జారీ చేసిన ఈ ప్రకటనలో చైనీయులు భారతదేశాన్ని సందర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలను కూడా ప్రస్తావించింది. ఇటీవలే మణిపూర్ రాష్ట్రంలోని భారత్ - మయన్నార్ సరిహద్దు వద్ద గూఢచర్యం నిర్వహిస్తున్నారన్న అనుమానంతో భారతీయ సైనికులు ఓ చైనీయుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

భారత్ వెళ్లే చైనా సందర్శకులు అక్కడ దొరికే ఏనుగు దంతాలను దళారుల వద్ద కొనవద్దని.. అలా కొంటే శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని  కూడా తెలిపింది. భారత్‌లో చైనీయుల హక్కులను కాపాడడమే ఎంబసీ ప్రధాన లక్ష్యమని.. కాకపోతే వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఎంబసీ ఏ మాత్రం సహకారం అందించదని కూడా చైనా ఎంబసీ ఆ ప్రకటనలో తెలిపింది

 

Trending News