India: 36 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Last Updated : Aug 31, 2020, 10:24 AM IST
India: 36 లక్షలు దాటిన కరోనా కేసులు

India Covid-19 updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదివారం ( ఆగస్టు 30న ) దేశవ్యాప్తంగా కొత్తగా 78,512 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 971 మంది మరణించారు. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. తాజాగా నమోదైన కేసులతో.. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,21,246కి పెరగగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 64,469 మంది మరణించారు. Also read: AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనాc

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా నుంచి 27,74,802 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,81,975 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 8,46,278 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో ఆగస్టు 30 వరకు మొత్తం 4,23,07,914 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.   Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

 

 

Trending News