Telangana Covid-19 updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ వేగంగా పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో ( శుక్రవారం ) తెలంగాణ రాష్ట్రంలో 2,474 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం తెలిపింది. ఈ మేరకు శనివారం ఉదయం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కు చేరుకోగా.. కరోనా మరణాల సంఖ్య 744కి పెరిగింది. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్
ప్రస్తుతం రాష్ట్రంలో 22,386 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 78,735 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. గడిచిన 24గంటల్లో 43,095 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,91,173 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు.. ఇలా ఉన్నాయి..
Also read: NCERT Books: అక్రమ దందా.. రూ.35కోట్ల పుస్తకాల సీజ్