Delhi Cabinet: కోటీశ్వర్లతో కొలువుదీరిన ఢిల్లీ సర్కారు..

Delhi Cabinet: ఎట్టకేలకు ఢిల్లీ కోటలో  భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది. 27 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపికి చెందిన రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈమె తో పాటు మరో ఆరుగురు క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఢిల్లీ క్యాబినేట్ లో ఉన్న వాళ్లందరు అపర కుబేరులు కావడం విశేషం.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 21, 2025, 01:35 PM IST
Delhi Cabinet: కోటీశ్వర్లతో కొలువుదీరిన ఢిల్లీ సర్కారు..

Delhi Cabinet:అవును ఢిల్లీ అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగరేసింది. అంతేకాదు ఢిల్లీలో కొత్తగా కొలువు దీరిన  క్యాబినేట్ మొత్తం కోటిశ్వరులతో కొలువుదీరింది. సీఎం రేఖా గుప్తాతో పాటు...మిగిలిన ఆరుగురు మంత్రులు కోటిశ్వరులేనని ఎన్నికల అఫిడవిట్లు వెల్లడించాయి. ఈ ఏడుగురి ఆస్తుల సగటు విలువ రూ. 56 కోట్లుగా ఉంది. ఇందులో రూ.248 కోట్ల ఆస్తితో మంత్రి మంజిందర్‌ సింగ్‌ సిర్సా మొదటి స్థానంలో ఉన్నారు. రూ. కోటి ఆస్తితో కపిల్‌మిశ్రా చివరి ప్లేస్ లో ఉన్నారు. అత్యధిక ఆస్తిపరుడైన మంజిందర్‌ సింగ్‌ సిర్సా కేవలం ఇంటర్ వరకే చదువుకున్నారు. మిగిలిన వారందరూ డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివారు. మంత్రిమండలిలోని ఏడుగురిలో రేఖా గుప్తా సహా అయిదుగురిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లు చెబుతున్నాయి. వీరందరికన్నా మంత్రి అశీశ్‌ సూద్‌ తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇక ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఖరారు చేసిన విజేందర్‌ గుప్తాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల క్రితం అసెంబ్లీ నుంచి ఈయన బహిష్కరణకు గురయ్యారు. తాజాగా ఆయన అదే సభకు స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ ఎమ్మెల్యేపై మరో విపక్ష ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభలో ఆందోళనలు చెలరేగాయి. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తాను అప్పటి స్పీకర్‌ ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు సభ నుంచి బహిష్కరించారు. బయటకు వెళ్లేందుకు విజేందర్‌ నిరాకరించడంతో.. మార్షల్స్‌ భుజాలపై ఎత్తుకొని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఢిల్లీలో కొత్తగా కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖాగుప్తా సర్కార్‌కు కత్తిమీద సామే అని చెప్పాలి. రాజధానిని పట్టిపీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం, మౌలిక వసతుల కల్పన, యమునా నది ప్రక్షాళన కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పాలి.  ఢిలీలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా తయారైందని బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పెద్దఎత్తున ఆప్‌ సర్కార్‌పై విమర్శలు చేశారు. ఆయా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత రేఖా గుప్తా ప్రభుత్వంపై ఉంది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News