mla raja singh on chhavaa movie release: ఛావా మూవీ రేపు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు విడుదల కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే.. వాలెంటైన్స్ డే అనగానే చాలా మంది తమ లవర్స్ తో సరదగా గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాలు, పార్క్ లు, ఏదైన ప్లాన్ లు చేసుకుంటారు. చాలా మంది తమ లవర్ ను తీసుకుని సీక్రెట్ ప్లేస్ లకు వెళ్తుంటారు. ఈ రోజున లాంగ్ డ్రైవ్ లకు కూడా వెళ్తుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఆఫీసులో ఛావా మూవీ టీజర్ చూశారు . దీనిలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కింది. ఈమూవీలో విక్కి కౌశాల్ శంభాజీ మహారాజ్ గా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న యేసు బాయ్ గా కన్పించనున్నారు. ఈక్రమంలో ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాజాసింగ్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ దయ వల్లే.. ఈరోజు హిందు సామ్రాజ్యం ఉందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప కథ ఆధారంగా తెరకెక్కిన ఛావాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని కూడా రాజా సింగ్ పిలుపునిచ్చారు.
యువత రేపు వాలెంటైన్స్ డే అని అడ్డమైన తిరుగుళ్లు తిరక్కుండా.. చావా సినిమా చూసి దేశ భక్తిని పెంపొందించుకొవాలని కూడా కోరారు.మరోవైపు ఈ మూవీని చూసేందుకు ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఛావా సినిా ఒక రేంజ్ లో ఇప్పటికే సక్సెస్ బజ్ ను సొంతం చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter