woman phone addiction video viral: ఇటీవల కాలంలో మొబైల్ కు ఎక్కువ మంది బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ఆరోప్రాణంలాగా మారిపొయింది. ఒక్కనిమిషం మొబైల్ కన్పించకపోతే.. అదేదో ప్రాణంపోయినంత పనైనట్లు ఫీలవుతున్నారు. అంతే కాకుండా.. మొబైల్ ను ఎక్కడికి వెళ్లిన అంటిపెట్టుకుని ఉంటున్నారు. చివరకు బాత్రూమ్ కు తీసుకెళ్లిన కూడా అక్కడ కూడా అస్సలు వదలడంలేదు.
చాలా మంది ఫోన్ లలో మాట్లాడుకుంటూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఫోన్ లలో మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతూ, రైల్వే ప్లాట్ ఫామ్ ల మీద వెళ్తు కొంత మంది తమ ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక మహిళ చేసిన ఘన కార్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ చంకలో తన బిడ్డను ఎత్తుకుంది. మరో చెతిలో ఇంట్లోని చెత్త కవర్ ను పట్టుకుంది.
అయితే.. సదరు మహిళ ఫోన్ మాట్లాడుతూ.. చెత్త కవర్ వేసే మున్సిపాలిటీ డస్ట్ బిన్ లో చెత్తకవర్ కు బదులు, పిల్లాడిని వేసింది. ఆ తర్వాత కొంత దూరం వెళ్లి.. తన తప్పును తెలుసుకుని తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని తిరిగి ఎత్తుకుంది.
పాపం.. ఆ పిల్లాడు తల్లి చేసిన పని చూస్తు ఉండిపోయాడు. ఆ తర్వాత మరల చెత్తకవర్ ను ఆ డస్ట్ బిన్ లో పడేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపైనెటిజన్ లు మండిపడుతున్నారు. మహిళ పని పట్ల తిట్టిపోస్తున్నారు. ఇదేం వ్యసనం అంటూ సెటైర్లు వేస్తున్నారు.