Hanuman Fevarate Lucky Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 11వ తేదీ చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు మంగళవారం కావడం, బుధ చంద్రగ్రహాల సంచారం జరగడం, అలాగే నక్షత్ర కదలికలు జరగబోతున్నాయి. దీంతో ఈ రెండో వారంలోని మంగళవారం ఎంతో శుభప్రదం కాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించి ఎంతో శక్తివంతమైన గ్రహం శనితో కలయిక జరపబోతున్నాడు. అలాగే కర్కాటక రాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన కొన్ని గ్రహాలు కూడా కదలికలు జరుపబోతున్నాయి.
నిజానికి మన హిందూ సంప్రదాయంలో మంగళవారాన్ని హనుమంతుడికి అంకితం చేస్తారు. అందుకే ఈరోజు చాలామంది హనుమంతుడిని పూజించడం మీరు గమనించవచ్చు. అయితే ఫిబ్రవరి రెండో వారంలో హనుమంతుడికి ఎంతో ఇష్టమైన కొన్ని గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. దీనివల్ల శుభ ప్రభావం ఏర్పడి రాశుల వారి వ్యక్తిగత జీవితంపై పడబోతోంది. అలాగే కొన్ని రాశుల వారిపై హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరు ఎలాంటి కష్టాలైనా దాటుకుని జీవితాన్ని ముందుకు నడుపుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయిన భవిష్యత్తులో ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. హనుమంతుడి అనుగ్రహం పొందే రాశులేవో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి
సింహ రాశి వారికి హనుమంతుడి అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది. కాబట్టి వీరు ఎలాంటి పనులు చేసిన ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు పొందగలుగుతారు. అంతేకాకుండా అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడు మంచి పనులు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి భాగస్వామి మద్దతు లభించి మానసిక ఆనందం పరంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఊహించని పదోన్నతులు లభించి ఉన్నత శిఖరాలకు చేరుతారు. ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వీరు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా సింహ రాశి వారికి హనుమంతుడి ఆశీస్సులతో అంతా బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తొలగిపోయి. భాగస్వామి సపోర్టుతో ముందుకు వెళతారు.
మీన రాశి
ప్రతి మంగళవారం మీన రాశి వారు హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు. అలాగే విపరీతమైన ధన లాభాలు చేకూరుతాయి. వీరికి ఒకవైపు భౌతిక ఆనందం లభించడమే కాకుండా మానసికంగా కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆంజనేయుడి ఆశీస్సులు లభించి ఊహించని విజయాలు సాధించే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారు తమ సహోద్యోగులతో పోటీపడుతూ పనులు చకచగా చేస్తారు. దీనివల్ల వీరికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక సొంత వ్యాపారాలు ప్రారంభించిన వారు చక్కగా చూసుకుంటూ... ముందుకు వెళ్లడం ఎంతో మంచిది. ఇక పరిశోధన రంగంలో పనులు చేస్తున్నవారు ఆంజనేయుడు అనుగ్రహం లభించి సక్సెస్ అవుతారు. కెరీర్ పరంగా కూడా వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. దీనికి కారణంగా వీరు ఎలాంటి పనులు చేసిన విశేషమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రతి మంగళవారం ఆంజనేయుడిని పూజించడం వల్ల వృశ్చిక రాశి వారు అద్భుతమైన శక్తులను పొందగలుగుతారు. ముఖ్యంగా వీరికి జ్ఞాపకశక్తి పెరిగి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కొత్త కొత్త పనులు నేర్చుకోవాలనుకునే వారికి ఆసక్తి కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.. దీనివల్ల వీరు కొన్ని సందర్భాలలో నష్టపోయినప్పటికీ ఊహించని స్థాయిలో లాభాలు పొందగలిగే అదృష్టాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా వీరు అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కుటుంబ జీవితం కూడా హనుమంతుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి