Allu Arjun in Pushpa2 Thanks Meet: ప్యాన్ ఇండియా క్రేజీ హీరో అల్లు అర్జున్ పుష్ప2 తో క్రేజ్ మరింత పెరిగిపోయింది. కొన్ని వివాదాల నడుమ ఆ సినిమా మంచి సక్సెస్ అయితే ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ పుష్ప2 థాంక్స్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని అన్నారు. అయితే, దీనిపై వెంటనే క్లారిటీ కూడా ఇచ్చారు.
'పుష్ప' సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన 'పుష్ప2' థాంక్స్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలో తనకు 'బాలీవుడ్' అనే పదం నచ్చదు అన్నారు. హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమన్నారు.
ఆ వ్యాఖ్యలు విన్న నిర్మాత రవిశంకర్ వెంటనే అప్రమత్తమయ్యారు. 'బాలీవుడ్' అనే వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని బన్నీ చెవిలో చెప్పారు. దీంతో ఆయన వెంటనే నాకు కేవలం ఆ పదం మాత్రమే నచ్చదు అని స్పష్టం చేశారు. అయితే, 'పుష్ప2' విడుదలకు ఓ హిందీ సినిమాను కూడా వాయిదా వేశారని దీంతో తాను ఆ మూవీ టీమ్‌కు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పానన్నారు బన్నీ.
పుష్ప సినిమా సక్సెస్‌కు కారణం ఫుల్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే అని బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. వెంటనే సుకుమార్ బన్నీని వెళ్లి హగ్ చేసుకున్నారు మీరు ఎమోషనల్ అయితే నేను ఎమోషనల్వ అవుతా ఫంక్షన్లో ఏడిస్తే బాగుండదు అని నవ్వులు పూయించాడు బన్నీ.
ఇక పుష్ప2 చివరన పార్ట్ 3 అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా బన్నీ క్లారిటీ ఇచ్చారు. అదేంటో నీకు తెలీదు.. నాకు తెలీదు అని సుకుమార్‌తో అన్నారు. కానీ అదో అద్భుతమైన ఎనర్జీ అయితే, ఇచ్చిందిఅన్నారు. సినిమా షూటింగ్ అన్ని అడ్డంకులు దాటుకుని పూర్తి చేశామన్నారు.
నిన్న థాంక్స్ మీట్లో బన్నీని చూసిన ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా 'పుష్ప2' విడుదల తర్వాత జరిగిన ఘటనల వల్ల పెద్ద సక్సెస్ సాధించినా మీడియాకు, అభిమానులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా పుష్ప2 థాంక్స్ మీట్లో నయా లుక్‌లో అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ మీట్లో ఆయన ఆనందంగా కనిపించారు. దీంతో ఫ్యాన్స్ బన్నీని ఇలా చూస్తే సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెడుతున్నారు.