BSNL 2 Voice Only Plans: భారత్ సంచార్ నిమమ్ లిమిటెడ్ (BSNL) డేటా వాడని వినియోగదారులకు తక్కువ ధరలో రెండు వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫీచర్ ఫోన్ వినియోగించే వారు అదనపు ఖర్చు చేయకుండా ఈ ప్లాన్స్ బడ్జెట్లోనే కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ రెండు వాయిస్ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ ట్రయ్ ఆదేశాల మేరకు డేటా వినియోగించని కస్టమర్ల కోసం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ ధరలు కేవలం రూ.147, రూ.319 మాత్రమే.. ఈ ప్లాన్స్‌తో డేటా అదనంగా కొనుగోలు చేయాల్సిన పనిలేదు. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లకు చెల్లిస్తే సరిపోతుంది.
ఇది స్మార్ట్ ఫోన్ వాడని వారికి ఎంతో బెస్ట్. ఇది 2 జీ నెట్వర్క్ ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం...
రూ. 147 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు వర్తిస్తుంది. ఇది కాకుండా రూ.319 ప్లాన్ కూడా పరిచయం చేసింది బీఎస్ఎన్ఎల్. దీని వ్యాలిడిటీ 65 రోజులు. బీహర్ బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్లాన్స్ ప్రకటించింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవలె టెలికాం కంపెనీలు డేటా వాడని కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురావలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఫీచర్ ఫోన్ వాడే వారు కూడా డేటా ఉండే రీఛార్జీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ రూ.99 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ 17 రోజులపాటు పొందుతారు. లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ కావాలంటే రూ.439 ప్లాన్ ఇందులో 90 రోజుల వ్యాలిడిటీ 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు.