Honda Qc1 Scooter Price: చీప్‌ ధరకే హోండా QC1 స్కూటర్‌.. ఫీచర్స్‌ చూస్తే దిమ్మతిరుగుద్ది!

Honda Qc1 Scooter Price: అద్భుతమైన ఫీచర్స్‌తో హోండా QC1 స్కూటర్‌ లాంచ్‌ పరిచమైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 7, 2025, 01:30 PM IST
Honda Qc1 Scooter Price: చీప్‌ ధరకే హోండా QC1 స్కూటర్‌.. ఫీచర్స్‌ చూస్తే దిమ్మతిరుగుద్ది!

Honda Qc1 Scooter Price: రూ. లక్ష కంటే తక్కువ ధరలోనే అద్భుతమైన స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కొత్తగా హోండా నుంచి అద్భుతమైన స్కూటర్‌ విడుదలైంది. ఈ స్కూటర్‌ లక్షలోపే లభిస్తోంది. హోండా కంపెనీ QC1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదలైంది. అంతేకాకుండా వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ధర, ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ.1,00,000 కంటే తక్కువ ధరలో లభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అలాగే ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. దాదాపు 80KM వరకు మైలేజీని అందిస్తుంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాలు తిరిగి పనులు చేసేవారికి ఈ స్కూటర్‌ చాలా అద్భుతంగా పని చేస్తుంది. 

హోండా QC1 స్కూటర్‌ రూ.90,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండబోతున్నట్లు తెలుస్తోది. అయితే ఈ స్కూటర్‌ వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇది పెర్ల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీతో పాటు పెర్ల్ మిస్టీ వైట్, పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్‌ ఇలా చాలా కలర్స్‌లో కస్టమర్స్‌కి లభించనుంది. ఈ స్కూటర్‌ స్టైలిష్ LED హెడ్‌లైట్లతో పాటు ప్రత్యేకమైన ఫ్రంట్‌ లుక్‌తో లభిస్తోంది. అలాగే స్పెషల్ LED టెయిల్‌లైట్లను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో స్పెషల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రాబోతోంది.

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ హోండా QC1 స్కూటర్‌ 26L బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డ్రమ్ బ్రేక్‌లతో పాటు ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో స్పెషల్ USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి. ఈ స్కూటర్‌లో 1.5kWh బ్యాటరీని కూడా అందిస్తోంది. దీని ఇంజన్‌  1.8kW పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News