RBI Cut Repo Rate: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర రేపో రేటుపై కీలక ప్రకటన నేడు చేశారు. ప్రస్తుతం 6.50 ఉన్న రేపో రేటును 6.25 శాతానికి తగ్గించింది. అంటే 25 బేసీస్ పాయింట్లు తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేటు 6.50 శాతం కొనసాగుతుంది, తాజాగా తగ్గించింది. ఈ తగ్గింపుతో ఎకానమీ పుంజుకోనుంది. బడ్జెట్లో ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్‌బీఐ కూడా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఇక నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లు పై కూడా మాట్లాడారు.ఇక దేశ జీడీపీ వృద్ధిని 6.6 శాతం నుంచి 6.7 శాతానికి సవరించారు. శక్తికాంత్ దాస్ పదవీకాలం ముగియడంతో సంజయ్ మల్హోత్రా డిసెంబర్లో ఆర్బిఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. భారత వృద్ధిరేటును అంచనాపై ఈ సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్ర మాట్లాడారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులో రుణాలు కూడా తక్కువ ధరలోనే సామాన్యులు రుణం పొందవచ్చు. ఇది సాధారణ వినియోగదారులకు భారీ ఊరట ఇస్తుంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రెపోరేట్ అంటే ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటును రెపో రేట్ అంటారు.. ఇది స్వల్పకాలిక వడ్డీ రేటు. దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటారు. రెపో రేటు తగ్గించడం వల్ల తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తాయి బ్యాంకులు.
ఇదీ చదవండి: సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. అసలు కారణం ఇదే..
రివర్స్ రెపో రేట్ ..
వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నప్పుడు ఆర్‌బీఐకి రుణాలను ఇస్తాయి. అలా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న మొత్తానికి ఆర్బిఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రేపు అంటారు. ఇది ఎప్పటికీ రెపో రేట్ కంటే తక్కువగానే ఉంటుంది. ఇక నగదు నిల్వల్ల నిష్పత్తి (CRR)అంటే బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లను బ్యాంకులు కొంత ఆర్‌భీఐ వద్ద కొంత భాగాన్ని జమ చేయాలి. వాటిని నగదు నిల్వల నిష్పత్తి అని పిలుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి