Viral Video: కుంభమేళాకు వచ్చి ఒక జంట పాడుపని.. ఆగ్రహాంతో నాగ సాధు ఏంచేశారంటే.. వీడియో వైరల్..

Maha kumbhmela: కుంభమేళకు వచ్చిన దంపతులు చేసిన పనిని అక్కడున్న వారు నాగసాధులకు చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 6, 2025, 09:44 AM IST
  • కుంభమేళలో రెచ్చిపోయిన నాగు సాధు..
  • ఇలాంటి పనులేంటని ఫైర్..
Viral Video: కుంభమేళాకు వచ్చి  ఒక జంట పాడుపని.. ఆగ్రహాంతో నాగ సాధు ఏంచేశారంటే.. వీడియో వైరల్..

Naga sadhu attacks on family who cooking chicken in kumbh mela: ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళలో పాల్గొనడానికి మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ నలు మూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

యోగి సర్కారు కూడా కుంభమేళకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కుంభమేళకు వస్తున్న భక్తుల కోసం అనేక శిబిరాలు, గుడారాలు తాత్కలికంగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. పవిత్రమైన ప్రదేశంకు వచ్చి ఒక జంట చేసిన పాడుపని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

కుంభమేళ హిందువుల పవిత్రమైన పండుగ. ఇప్పటికే కుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో మద్యం,మాంసంను ప్రభుత్వం నిషేధించింది. అయితే.. ఒక జంట మాత్రం సీక్రెట్ గా తమ గుడారాల్లో మాంసాహారం వండుకున్నారు. అది కాస్త అక్కడి వాళ్లు గమనించారు.

వెంటనే సమీపంలోని నాగాసాధులకు చెప్పారు. దీంతో ఆవేశంలో ఊగిపోయిన నాగసాధులు, భక్తులు అక్కడికి చేరుకుని సదరు దంపతులు ఉంటున్న గుడారాలను కూల్చేశారు. వారిపై తీవ్రంగా మండిపడి.. దాడులు సైతం చేశారు.

Read more: Viral Video: బాప్ రే... నరాలు తేగె ఉత్కంఠ.. ఒకే బావిలో పడ్డ పెద్దపులి, అడవి పంది.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో వైరల్..

గిన్నెలలో ఉన్న మాంసాహారం వంటకాన్ని కింద పాడేశారు. పవిత్రమైన ప్రదేశంకు వచ్చి.. ఇలాంటి పనులు ఏంటని రెచ్చిపోయారు. ఈ క్రమంలో వారి గుడారాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News