"అల్లా తరువాత మీపైనే మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకు దారి చూపించండి. ఎంబసీ ద్వారా మెడికల్ వీసా ఇప్పించండి. మా సోదరుడికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించాలి" అంటూ పాకిస్థాన్ లోని ఒక కుటుంబం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
దీనికి వెంటనే స్పందించిన మంత్రి సుష్మా స్వరాజ్ - " భారత్ మీ ఆశలను వమ్ము చేయదు. మీకు వెంటనే వీసా ఏర్పాట్లు చేస్తాం." అంటూ పోస్ట్ చేశారు. పాకిస్థాన్ లోని భారత హైకమీషన్ కు ఆ కుటుంబంలోని నలుగురికి వెంటనే మెడికల్ వీసా ఇవ్వాలని ఆదేశించారు.
India will not belie your hope. We will issue the visa immediately. @IndiainPakistan https://t.co/XMGaNrA5i6
— Sushma Swaraj (@SushmaSwaraj) November 25, 2017