ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. భారత్ విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పాక్ జట్టు బోల్తా పడింది. భారత బౌలర్లు విజృంభించడంతో 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
పాకిస్థాన్ క్రికెట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. పాక్ సీనియర్ క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలతో శనివారం కరోనా పరీక్షలకు వెళ్లాడు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు.
పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం వేటు పడింది. ఏ ఫార్మాట్లోనూ నిషేధకాలంలో ఆడేందుకు వీలు లేదని సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన నిర్ణయాన్ని ప్రకటించింది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
దాయాది పాకిస్థాన్ హద్దులు మీరితే ఉపేక్షించేది లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. శాంతి ఒప్పందాలను అనుసరించి ఉంటున్నామని, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మాజీ అధ్యక్షుడు Pervez Musharraf దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ముగ్గురు న్యామూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు కాలేదని గుర్తించింది.
భారత్ లేనిపోని ఆరోపణలతో అమెరికాని నమ్మించి అమెరికా నుంచి పాకిస్థాన్‌కి అందాల్సిన ఆర్థిక సహాయం నిలిపివేసేలా ప్రభావితం చేసిందని హఫీజ్ సయీద్ విమర్శలు గుప్పించాడు.
పాకిస్థాన్ లో ఉంటున్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్-ఏ- తోయిబా సహ వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్ ర్యాలీలో పాలస్తీనా రాయబారి హాజరుకావడంపై భారత్ తీవ్రంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి పాకిస్థాన్ తో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా ఖండించారు.
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దాయాది దేశం పాకిస్థాన్ స్పందించిన తీరును తప్పుబట్టారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (ఆర్వి ప్రసాద్). ప్రజాస్వామ్యంపై పాకిస్థాన్ మాకు హితబోధన చేయడం మానుకోవాలని చురకలంటించారు.
ఏంటీ .. బెంబేలెత్తిపోయారా! అవును అక్కడ టమాటో కిలో అక్షరాలా 300 రూపాయలు. అయితే ఈ రేటు మన దేశంలో కాదు.. పక్క దేశం పాకిస్థాన్ లో. పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ పేపర్లో ఈ కథనం ప్రచురితమైంది. సాధారణ పౌరుడు మిన్నంటిన టమాటా ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు. రాజకీయ నాయకులు భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. యుద్ధం వస్తే సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అంతేకానీ అక్కడి నుంచి ఎటువంటి దిగుమతులను చేసుకోం అంటున్నారు. మీకు ప్రజల గోడు పట్టదా.. ! అని అభిప్రాయాన్ని వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.