Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆ ఒక్క కారణంతో సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాల్లోనే ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు కోల్పోయింది. దలాల్ స్ట్రీట్ పై ప్రభావం చూపిన అంశాలను ఓసారి తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Feb 3, 2025, 04:12 PM IST
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆ ఒక్క కారణంతో సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్

Stock Market: ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు ట్రేడింగ్ అనుకూలంగా ఉంటుందని అంతా భావించినా ట్రంప్ రూపంలో పిడుగుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పాలసీ ప్రకటించిన క్రమంలో అది పలు దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోయింది. 

బడ్జెట్ రోజు శనివారం ట్రేడింగ్ సెషన్ లో 77, 506 దగ్గర ముగిసిన సెన్సెక్స్ సోమవారం నాటి ట్రేడింగ్ లో 77, 064 దగ్గర ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 76,756 కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30గంటల సమయం కాస్త కోలుకోని సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 77వేల 156దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 23,338దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్స్ ఇండెక్స్ 0.59 శాతం నష్టపోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.27శాతం నష్టపోయింది. 

Also Read: Baby Born: 'కలయిక' లేకుండానే సంతానం .. పిల్లలను కనాలంటే ఇకపై మహిళలు అవసరం లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. దీంతో వాణిజ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అది అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆసియా మార్కెట్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి. జపాన్ నిక్కీ, కొరియా కోస్పీ 3శాతానికిపైగా నష్టపోయాయి. మరోవైపు భారత రూపాయి మారకం విలువ తొలిసారిగా రూ. 87మార్క్ దాటింది. ట్రంప్ టారిఫ్ పాలసీతో డాలర్ బలపడటంతో రూపాయి విలువ భారీగా పడిపోయింది. వీటితోపాటుగా విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి మళ్లస్తుండటం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. 

బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, విప్రో, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు సగటున 2.50శాతం లాభంతో కొనసాగుతున్నాయి. అయితే లారెన్స్, ఓఎన్‌జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టటా మోటార్స్, వంటి ప్రధాన కంపెనీల షేర్లు 3 శాతానికిపైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 

Also Read: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News