Chandrababu U Turn: సూపర్ సిక్స్‌పై చంద్రబాబు యూ టర్న్, జగన్ చేతికి అస్త్రం లభించేసిందా

Chandrababu U Turn: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పుడే అపసోపాలు పడిపోతోంది. చేసిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసిన పరిస్థితి ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అస్త్ర సన్యాసం చేయకుండానే వైఎస్ జగన్‌కు తిరుగులేని అస్త్రం అందించారు చంద్రబాబు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2025, 03:52 PM IST
Chandrababu U Turn: సూపర్ సిక్స్‌పై చంద్రబాబు యూ టర్న్, జగన్ చేతికి అస్త్రం లభించేసిందా

Chandrababu U Turn: గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలా పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తిరుగులేని ఆస్త్రాన్ని అందించారు. కూటమి ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు కావల్సినంత కంటెంట్ ఇచ్చారు. 

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే జనంలో వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఓ వైపు సీనియర్ నేతలు పార్టీని వదిలిపెడుతున్నా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టే ప్రణాళిక రచిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీగా హామీలిచ్చింది.అందులో సూపర్ సిక్స్ ముఖ్యమైంది. ఇప్పుడీ ఎన్నికల హామీల్ని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. ఈ విషయమై ప్రజల్లో ఇప్పటికే కొద్దిగా వ్యతిరేకత మొదలైంది. దీనికితోడు స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వైసీపీకు మరింత అనుకూలం చేస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకోవడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తిరుగులేని అయుధం లభించినట్టయింది. 

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగా లేదని గణాంకాలు ప్రజల ముందుంచారు. శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు తగిన వైద్యం చేయాలి కదా అంటూ కథలు మొదలెట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకు చాలా అనుకూలం కానున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చే హామీలు అమలు సాధ్యం కానివని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదని చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదని స్వయంగా చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. అయినా సరే హామీలిచ్చారు. జనం కూటమికి జైకొట్టేశారు. అధికారంలో రాగానే పెన్షన్ల పెంపు తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. అధికారంలో వచ్చినప్పట్నించి మిగిలిన హామీలపై అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు. ఆర్ధిక పరిస్థితి బాగుపడిన తరువాతే అమలు చేస్తామని చెప్పారు. 

ఇప్పుడిదే వైఎస్ జగన్‌కు అస్త్రంగా మారింది. ఫిబ్రవరి నుంచి వైఎస్ జగన్ ప్రజల్లో వెళ్లేందుకు నిర్ణయించుకున్న క్రమంలో చంద్రబాబు యూ టర్న్ మంచి ఆయుధంగా మారబోతోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఆందోళన చేపట్టిన పార్టీ రైతు భరోసా, పీజు రీయింబర్స్‌మెంట్‌పై నిరసనలకు పిలుపునిచ్చింది. తాజాగా సూపర్ సిక్స్ విషయంలో చేతులెత్తేయడంతో జగన్‌కు మంచి అస్త్రం లభించింది. 

Also read: Nara Lokesh: ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ పేరు ఖరారైనట్టేనా, లోకేశ్ మాటల అర్ధమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News