Andhra Pradesh Air Pollution: ఆంధ్ర ప్రదేశ్(AP)లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. రోజురోజుకు ప్రధాన పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్-10 విశాఖపట్నం, విజయవాడ నిలిచాయి.
రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్యనియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాయు కాలుష్యం నియంత్రణకు పలు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లేస్ లో సౌర విద్యుత్ పాటు తిరుపతి, రాయలసీమ ప్రాంతాల్లో వాయు విద్యుత్ ను ఎక్కువగా ఉత్పాదన చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. అటు నీటి నుంచి వచ్చే హైడల్ విద్యుత్ ఉత్పత్తిని వాన కాలంలో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కాలుష్యానికి కారణమవుతున్న వాహానాల ప్లేస్ లో విద్యుత్ నడిచే వాహానాలను ఎంకరేజ్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈవీలు కొనేవాళ్లకు తెలంగాణ తరహాలోనే కొన్నాళ్ల పాటు లైఫ్ టాక్స్ రద్దు చేయడం సహా పలు అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.