Padma Bhushan Ajith: తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేసిన పద్మభూషణ్ అజిత్ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..

Padma Bhushan Ajith: కేంద్రం 2025 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో తెలుగులో  సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. అటు తమిళనాడు సూపర్ స్టార్ అజిత్ తో పాటు శోభన, శేఖర్  కపూర్ సహా పలువురిని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో  అజిత్ తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేయడంతో పాటు పద్మభూషణ్ వరకు అజిత్ సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2025, 12:09 PM IST
Padma Bhushan Ajith: తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేసిన పద్మభూషణ్ అజిత్ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..

Padma Bhushan Ajith: మన హీరోలు తెరపై మాత్రమే హీరోయిజాన్ని ప్రదర్శిస్తారు. కానీ తెర వెనక నిజ జీవితంలో కూడా  సాహసాలకు పెట్టింది పేరు అజిత్. స్టార్ డమ్ వెనక ఆయన పరిగెత్తలేదు. అదే ఆయన్ని వరించింది. అంతేకాదు సెలబ్రిటీ ఇమేజ్ కు దూరంగా సామాన్యుడిలో సామాన్యుడిలా కలిసి పోవడమే ఆయనకు ఎంతో అభిమానులను సంపాదించి పెట్టింది. అంతేకాదు భాష భేదం లేకండా అందరి అభిమానాన్ని పొందారు. 35 యేళ్ల సినీ ప్రస్థానంలో 60పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో అలరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి పర్యాయ పదం ఆ రూపం.. సాహసాలకు వెరవని వ్యక్తిత్వం ఆయన సొంతం.. స్టార్‌డమ్‌కు ఆమడ దూరంలో బతికే అసామాన్య వ్యక్తిత్వం.. ఇవే కథానాయకుడు అజిత్‌ను (Ajith Kumar)  సినీప్రియుల మదిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రాంతాలు.. భాషలకు అతీతంగా భారతీయ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. 35ఏళ్ల సినీ ప్రయాణంలో.. 60కిపైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మురిపించిన ఆయన ఇప్పుడు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారం దక్కించుకున్నారు.

అజిత్ కు తమిళం, తెలుగు, హిందీ  సహా పలు భాషల్లో పరిచయం ఉంది.  అజిత్ కుమార్ తమిళనాడు సూపర్ స్టార్ అయిన తెలంగాణ గడ్డనే అజిత్ అడ్డ. ఇక్కడ సికింద్రాబాద్ లో జన్మించారు. అతేకాదు వీలు దొరికినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు.   కానీ తమిళనాడులో మాత్రం ఈయన స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  అక్కడ ‘ఎన్ వీడు ఎవ్ కనావర్’  సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1993లో ‘అమరావతి’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ వెంటనే ‘ప్రేమ పుస్తకం’ సినిమాలో నటించారు. తెలుగులో  పెద్దగా ఒరిందేమి లేదు.  తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాల, కాదల్ మన్నన్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

హీరోగా కెరీర్ మొదట్లో ప్రేమకథా చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత మాస్ యాక్షన్ హీరోగా స్థిరపడింది. 1999లో యస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అజిత్ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత తన సహచర నటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్లాడారు. ఇక ఆటో రేసింగ్ కెరీర్ ను ఎంచుకున్న అజిత్ ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ తర్వాత అమెచ్యూర్ రేసులో శిక్షణ తీసుకుంటూ ఉండగా.. ఆయన వీపు వెనక భాగంలో మూడు పెద్ద శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రమాదంతో యేడాది మంచానికే పరిమితమయ్యారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఆ వెంటనే ‘పాసమలర్గల్’ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించారు. 1995లో రిలీజైన ‘ఆశై’ అజిత్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక తెలుగులో ఈయన నటించిన ‘ప్రేమలేఖ’ సినిమా మంచి గుర్తింపు వచ్చింది. ఇక లవర్ ఇమేజ్ నుంచి యాక్షన్ హీరోగా టర్న్ తీసుకున్నారు.
అలా ఆయన నటించిన ‘ఉల్లాసం’, బిల్లా, వాలీ, వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం ఇలా వరుసగా యాక్షన్ చిత్రాలతో వెనుదిరిగి చూసుకోలేదు.

ఎవరైనా కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ అజిత్ స్లైలే వేరు. షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినా.. బైక్ పై దేశాన్ని చుట్టేస్తుంటారు. 18 యేట నుంచి దేశ, విదేశాల్లో ఎన్నో బైక్ రేసింగ్ లలో పాల్గొన్నారు. ఈ రేసింగ్ లో ఎన్నో ప్రమాదాన్ని ఫేస్ చేసారు. తన జీవితంలో 15 సర్జరీలు జరిగాయి. వెన్నుముకకు గాయాలయ్యాయి. ఆయన సాహసాలకు పెట్టింది పేరైనా..రీసెంట్ గా జరిగిన 24 హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ జట్టు విజయం సాధించింది. అంతేకాదు విమానం నడపడంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాదు సర్టిఫైట్ పైలెట్ లైసెన్స్ పొందారు. మన దేశంలో పైలెట్ లైసెన్స్ ఉన్న ఏకైక నటుడు అజిత్ కావడం విశేషం.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News