School Holiday 2025: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..!

Shab e Meraj School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. మొన్నటి వరకు సంక్రాంతి స్కూల్‌ హాలిడేలు ఎంజాయ్‌ చేశారు. దాదాపు పదిరోజుల వరకు సెలవులు వచ్చాయి. అయితే, రేపు జనవరి 28 స్కూళ్లకు సెలవు ఉంది. షబ్‌ ఏ మేరజ్‌ సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది. అయితే ఇది ఆప్షనల్‌ హాలిడే. ఈనేపథ్యంలో ఏ స్కూళ్లకు సెలవు రానుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్, జనవరి 28వ తేదీ షబ్‌ ఏ మేరాజ్‌ ఆప్షనల్‌ హాలిడే. ఈ సందర్భంగా స్కూళ్లు, పలు కాలేజీలకు సెలవు రానుంది. జనవరి 14వ తేదీ సంక్రాంతి సందర్భంగా స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు వచ్చాయి. రేపు కూడా మళ్లీ సెలవు రావడంతో వారికి గుడ్‌ న్యూస్ అయింది.  

2 /5

స్కూళ్లకు సెలవులు అంటేనే విద్యార్థులు ఎంజాయ్‌ చేస్తారు. మార్చినెలలో పలు పబ్లిక్‌ పరీక్షలు కూడా మొదలవుతున్నాయి.  అయితే, షబ్ ఏ మేరాజ్‌ అంటే ముస్లింలా పండుగ. ఈ రోజువారు జాగరణ చేస్తారు, మసీదులను దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు.  

3 /5

గత ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ షబ్‌ ఏ మేరాజ్‌ నిర్వహించారు. అయితే, అప్పుడు ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు పలు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. అయితే, ఈసారి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి.  

4 /5

షబ్‌ ఏ మేరాజ్‌ ఆప్షనల్ హాలిడే కాబట్టి మిగతా విద్యాసంస్థల స్వీయ నిర్ణయం ప్రకారం తరగతులు జరిగే అవకాశం ఉంది. లేదా సెలవును కూడా ఇవ్వచ్చు. అయితే, జమ్మూ కశ్మఈర్‌తోపాటు పలు రాష్ట్రాల్లో రేపు షబ్‌ ఏ మేరాజ్‌ సందర్భంగా ఆ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో కేవలం మైనార్టీ స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే సెలవు ఉండొచ్చు.  

5 /5

ఇక జనవరి నెలలో సంక్రాంతి సెలవులు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్కూళ్లకు పదిరోజులు, వారం ఇచ్చార. ఈ నెలలో ఇక స్కూళ్లకు సెలవులు లేవు అయిపోయినట్లే. ఎందుకంటే ఈనెల 31 శుక్రవారంతో పూర్తవుతుంది. మళ్లీ ఫిబ్రవరి నెలలోనే స్కూళ్లకు సెలవులు రానున్నాయి. జనవరి 26వ తేదీ హిందూవుల పరమ పవిత్రమైన పండుగ మహాశివరాత్రి రానుంది. ఇవి కాకుండా పలు పండుగలు, ప్రత్యేక దినాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఆరోజుల్లో స్కూళ్లకు సెలవులు వస్తాయి.