Meerpet Murder Case Shocking Fact: మీర్పేట్ మర్డర్ కేసులో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది.. ఓ వెబ్ సిరీస్ స్పూర్తితోనే గురుమూర్తి తన భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.. ఇక ఈ 'సూక్ష్మ దర్శిని' సినిమాలో దత్తతకు తీసుకున్న ఓ కుమార్తెను తల్లి, కొడుకు కలిసి హతమారుస్తారు. అంతే కాదు ఆమె శరీర భాగాలను ఓ కెమికల్ ట్యాంకులో వేసి కరిగిస్తారు. దాన్ని ఒక వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా బయటకు వదులుతారు. ఆ మూవీలో మర్డర్ చేసిన విధంగానే గురుమూర్తి కూడా మాధవి డెడ్ బాడీని మాయం చేశాడు గురుమూర్తి.
ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయిన గురుమూర్తి డిఆర్డిఓలో సెక్యూరిటీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇక ఆయన తన బంధువులలోని ఒక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు గురుమూర్తి. ఈ విషయంపై మాధవి గురుమూర్తిని నిలదీయడంతో ఆమెను బలవంతంగా తోసేశాడు. దీంతో మాధవి ప్రాణాలు వదిలింది. చనిపోయిన మాధవి డెడ్ బాడీని 72 ముక్కలుగా నరికి ఆమెను హీటర్‌లో వేసి బాగా ఉడికించాడు. ఆ తర్వాత బొక్కలను ముక్కలను వేరు చేసి బొక్కలను బాగా కాల్చేసాడు. వాటిని మళ్లీ దంచి పొడిచేశాడు. ఇక ముక్కలను మెత్తగా దంచి ఆ రెండిటిని కలిపి ఓ సంచీలో వేసుకుని సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు గురుమూర్తి. ఆ తర్వాత అత్తమామలతో కలిసి ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు జనవరి 15వ తేదీ నమోదు చేశాడు గురుమూర్తి.. అయితే గురు మూర్తిపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాను పర్యవేక్షించగా అందులో మాధవి ఇంట్లోకి వెళ్లినట్లుగా ఉంది. కానీ బయటకు వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో తమదైన స్టైల్ లో పోలీసులు గురు మూర్తిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అయితే కొద్ది రోజులు దీనికి సరైన ఆధారాలు లేక తలలు పట్టుకున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: బడ్జెట్లో ప్రధానమంత్రి రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడంటే?
అయితే ఇన్ఫ్రా రెడ్ టెక్నాలజీ సహాయంతో ఎట్టకేలకు మాధవి ఆనవాళ్లు కిచెన్ స్టవ్ వద్ద కాలిన వెంట్రుకలను గుర్తించారు. అలాగే కొన్ని రక్త నమూనాలు కూడా గుర్తించారు. వీటిని డిఎన్ఏ టెస్ట్ కి పంపించారు. మాధవి డిఎన్ఏ పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయితే ఇక ఈ మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా మాధవిని మర్డర్ చేసిన గురుమూర్తి తాజాగా 'సూక్ష్మ దర్శిని' మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి మర్డర్ చేశాడని తెలుస్తోంది. అదేవిధంగా గురుమూర్తి కూడా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను హీరోయిన్ నజీరియా నజీమ్, హీరోగా బేసిల్ జోసెఫ్ నటించారు. ఇందులో మెర్లిన్ ఫిలిప్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలో నటించారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.