Telangana Padma Awards: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా ప్రకటించే పౌర పురస్కారాల్లో మరోసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపింది. పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిభ కలిగిన కళాకారులు, సాహిత్యవేత్తలను సిఫారసు చేసినా కూడా కేంద్ర పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. పద్మ పురస్కారాల్లో వివక్షపై తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పుబడుతోంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌కు గద్దర్, పద్మభూషణ్‌కు చుక్కా రామయ్య, పద్మభూషణ్‌కు అందెశ్రీ, పద్మశ్రీ అవార్డులకు గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులను సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. అవార్డుల్లో వివక్ష చూపించడంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: PMAY Houses: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ 'భారీ' విజ్ఞప్తి.. 'మాకు 20 లక్షల ఇళ్లు ఇవ్వండి'
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రులు, అధికారులతో పద్మ పురస్కారాలపై ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు.
139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఐదు పురస్కారాలు ప్రకటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల్లో వివక్షపై బీఆర్‌ఎస్ పార్టీ కూడా తీవ్రంగా తప్పుబడుతోంది. తెలంగాణపై ఆది నుంచి మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చెప్పడానికి తాజాగా పద్మ పురస్కారాలు నిదర్శనంగా చెబుతోంది. రేపు.. ఎల్లుండి బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.