Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఒకరిని అదుపులోకి తీసుకున్న బాంద్రా పోలీసులు..

Saif Ali khan attack case: సైఫ్ అలీఖాన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగంను పెంచారు. ఇప్పటికే ఈ కేసులో బాంద్రా పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 17, 2025, 12:27 PM IST
  • సైఫ్ ఘటనలో కీలక పరిణామం..
  • అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఒకరిని అదుపులోకి తీసుకున్న బాంద్రా పోలీసులు..

saif ali khan attack case latest update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన దేశంలో దుమారంగా మారింది.  ముంబైలోకి బాంద్రాలో సైఫ్ ఇంటిలో నిన్న రాత్రి దుండగులు ప్రవేంచి సైఫ్ కొడుకు గదిలోకి వెళ్లారు. అక్కడ గొడవ చోటు చేసుకుంది. దీంతో అలికిడి కావడంతో సైఫ్ అక్కడికి వెళ్లాడు. దుండగుడు సైఫ్ ను రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేయగా.. తీవ్రమైన పెనుగులాట సంభవించింది. అప్పటికే దుండగుడు పలు పర్యాయాలు కత్తితో సైఫ్ ను ఇష్టమున్నట్లు పొడిచాడు. ఆ తర్వాత  సైఫ్ అరుపులతో.. ఆయన కొడుకు బైటకు వచ్చాడు. దుండగుడు పారిపోయాడు.

వెంటనే రక్తపు మరకలతో ఉన్న సైఫ్ ను ఆయన కొడుకు.. ఆటోలో  లీలావతి ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే సైఫ్ కు అర్జంట్ గా.. రెండు సర్జరీలు చేశారు. అంతే కాకుండా.. వెన్నెముకలో ఉన్న కత్తి ముక్కను కూడా తొలగించినట్లు వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే.. ఈ ఘటనను ముంబై క్రైమ్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

దర్యాప్తు అధికారిగా.. దయా నాయక్ ను నియమించారు. సైఫ్ ఇంటిలోపల ఉన్న సీసీ టీవీలు, ఇంటిపక్కన ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే.. సైఫ్ పక్కింటి సీసీ టీవీ ఫుటేజీలో.. ఆగంతకుల కదలికలు రికార్డు అయ్యాయి. అదే విధంగా సైఫ్ ఇంట్లో కూడా.. బంగ్లా మీద నుంచి దుండగుడు  ఇంట్లో ప్రవేశించిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో తాజాగా.. బాంద్రా పోలీసులు ఈ కేసులో సంబంధం ఉన్న కోణంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని బాంద్రా పీఎస్ కు తరలించారు. అతడ్ని అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణ వివరాలు తెలియాల్సి ఉంది.

Read more: Saif ali khan net worth: సైఫ్‌ అలీఖాన్.. ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?.. కళ్లు బైర్లు కమ్మడం పక్కా..

మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను టార్గెట్‌గా చేసుకుని అపోసిషన్ పార్టీ నేతలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఇటీవల ముంబైలో అది కూడా.. వీఐపీలు ఎక్కువగా ఉండే.. బాంద్రాలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగటం ప్రభుత్వం వైఫలం స్పష్టంగా కన్పిస్తుందని  ఏపీపారేస్తున్నారు.

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సంచలన ట్విట్ చేశారు. వీఐపీలకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఫడ్నవీస్ సర్కారుపై మండిపడుతున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News