Snake Viral Video: ఇది మాములు ఫైటింగ్ కాదు భయ్యా.. వీడియో చూస్తే భయంతో జడుసుకుంటారు..

Snake Vs Mongoose: ముంగీస బారి నుంచి తప్పించుకునేందుకు పాము శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 11, 2025, 04:54 PM IST
  • ముంగీసకు చుక్కలు చూపించిన పాము..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Snake Viral Video: ఇది మాములు ఫైటింగ్ కాదు భయ్యా.. వీడియో చూస్తే భయంతో జడుసుకుంటారు..

Venomous snake and mongoose fighting: పాములకు ముఖ్యంగా కొన్ని జీవులంటే అస్సలు పడదు. గద్దలు, కోతులు, కుక్కలు , ముంగీసలంటే.. పాములకు అస్సలు పడదు. అవి ఎక్కడ కన్పించిన వాటి బారి నుంచి పాములు తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటాయి. చాలా సార్లు మనం ముంగీసలు, పాముల ఫైటింగ్ లు చూస్తుంటాం.

కొన్నిసార్లు ముంగీసలు పై చేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు పాములు విజయం సాధిస్తుంటాయి. అయితే.. ముంగీసలు, పాములకు దాడులు చేసిన అనేక ఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా.. ఒక పాము, ముంగీసల జగడంకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asmanjan Asmanjan (@asmanjan_rj_11)

పాము చెట్ల నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అది కాస్త ముంగీస కంట పడింది. ఇంకేముందీ.. పామును పట్టుకునేందుకు ముంగీస యుద్దరంగంలోకి దిగింది. పాము మూతిని పట్టేసుకుందామని అనేక విధాలుగా ప్రయత్నించింది. కానీ పాము కూడా అంతే చాకచక్యంతో పాము బారి నుంచి తప్పించుకుంది. అంతే కాకుండా.. గాల్లో ఎగురుతూ.. ముంగీసకు చుక్కలు చూపించింది. పాము బుసలు కొడుతున్న ముంగీస కూడా పలు మార్లు పామును కొరికేసేందుకు ప్రయత్నించింది.

రెండు కూడా రోడ్డు మీద సమరానికి దిగాయి. కానీ చివరకు పాము స్పీడ్ గా ముంగీసకు ట్విస్ట్ ఇచ్చేసి.. చెట్లలోకి దూరిపోయింది. పాము, ముంగీస పొట్లాటను అక్కడున్న వారు తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పొస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. మరికొందరు పాము, ముంగీస ఫైటింగ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Trending News