Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు స్కూల్ కట్టించండి అని చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్తించడం గ్రామస్తుల మనసును కలిచివేచేస్తోంది.. మిడ్ మానేరు జలాశయంలో పాఠశాల మునిగిపోయి అద్దె భవనంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఆరు సంవత్సరాలుగా అద్దె భావనంలో పాఠాలు విద్యాభ్యాసాలు కొనసాగిస్తున్నారు .. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి గ్రామం కొంత వరకు శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరు జలాశయంలో ముంపునకు గురైంది. అయితే ఆరేపల్లి గ్రామాన్ని ప్రభుత్వం పాక్షిక ముంపు గ్రామంగా ప్రకటించింది.
మిడ్ మానేరులో నీటి విడుదల చేసినప్పుడు ఆరేపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ పూర్తిగా నీట మునగడంతో పాఠశాలను గ్రామంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అద్దె భవనానికి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో గ్రామ మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీన రాజు ఔదార్యంతో గత ఆరు సంవత్సరాలుగా, అద్దె చెల్లెస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ అద్దె భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనని భయం భయంగా పిల్లలు బిక్కు బిక్కు మంటూ చదువును కొనసాగిస్తున్నారు.
పిల్లలకు రక్షణ లేకపోవడంతో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి నిరాకరించి, ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో పాఠశాలలో 30 మంది విద్యార్థుల సంఖ్య కాస్త ఎనిమిదికి చేరింది. వర్షం పడినప్పుడు తరగతి గదిలో పలు చోట్ల వర్షపు నీరు ఊరవడంతో గది పూర్తిగా నానిపోయి.. చిన్న చిన్న పాములు, తేళ్లు వస్తాయని విద్యార్థులు చెబుతున్నారు. కూర్చోవడానికి కూడా చోటు ఉండదని, బెంచిల పై పుస్తకాలను పెట్టుకొని వర్షం తగ్గే వరకు ఒకే చోట నించునే ఉంటామని, స్కూల్‌లో టాయిలెట్స్ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తే చక్కగా చదువుకుంటామని తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.