Chiranjeevi: ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ భాగ్య నగరంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. యంగ్ ఎంటర్‌ప్రెన్యూరర్స్‌ని ఎంకరేజ్ చేయటానికి అందరూ ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడున్న వారందరూ నా కుటుంబ సభ్యులు. ప్రతీ ఒక్కరిలో నాపై వారికున్న అభిమానం, తెలుగు మీదున్న అభిమానం, దేశం మీదున్న అభిమానం కనిపిస్తోంది. నాకు గొప్ప స్వాగతాన్ని ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసారు చిరంజీవి.
నేను ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తితో బాల్ బాడ్మింటన్‌కు వెళితే అక్కడ బాల్ నా కంటికి తగిలి వాచిపోయింది. తర్వాత వాలీబాల్ ఆట ఆడుదామని వెళితే అక్కడ కూడా బాల్ తగిలి వేళ్లు వంగిపోయాయి. క్రికెట్‌కు వెళితే బాల్ బొటనవేలుకి తగిలి వాచిపోయింది. దీంతో గేమ్స్ అచ్చిరాదనిపిస్తున్న తరుణంలో ఎన్‌సీసీలో జాయిన్ అయ్యాను. బీకాం ఫైనల్ ఇయర్‌లో ఢిల్లీలోని రాష్ట్రపతి రోడ్డుపై సైన్యంతో కలిసి కవాతు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో రాజీనామా అనే డ్రామాలో యాక్ట్ చేశాను. దాంతో కాలేజ్‌లో నన్ను అందరూ హీరోలాగా చూడటం ప్రారంభించారు. అప్పుడే నా భవిష్యత్ నటన అయితే ఎలా ఉంటుందనే ఆలోచనకు బీజం పడింది అక్కడే అన్నారు. కాలేజ్ చదువు అయిపోగానే మద్రాస్‌లో యాక్టింగ్ స్కూల్‌కి వెళతానని నాన్నగారు సందేహించినా.. ఆ తర్వాత చెబితే ఓకే చెప్పారు. నేను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ పూర్తి చేయక ముందే నాకు దర్శక నిర్మాతలు సినిమాల్లో ఛాన్స్ లిచ్చారు. ఎప్పుడైనా పాండిబజార్‌కి వెళ్లినప్పుడు కొంత మంది నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు. కుంగిపోయేవాడిని, రూమ్‌కెళ్లి నిద్రపోయేవాడిని కాదు. ఆరోజు నాకు ఆంజనేయస్వామి మాత్రమే తోడుగా ఉండేవాడు. ఆయనతో మనసులో మాట్లాడుకునేవాడిని. ఆయనే నాకు సమాధానం చెబుతున్నట్లు ఉండేది.
కళ్లకు గంతలు కట్టిన గుర్రంలాగా లక్ష్యం వైపు ప్రయాణించాను. సినిమాల్లో నెంబర్ వన్ కావాలనే ధ్యేయంతో ప్రయాణం సాగించాను. ఈ లోపు నాకు అవమానాలు కూడా ఎదురయ్యాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ప్రయాణించాను. నాకు నేనుగా నేర్చుకున్న ఫిలాసఫీతో ముందుకు వెళ్లాను. స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో తిరుగులేని మనిషి చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో మరో మూవీ ‘కొండవీటి సింహం’ చేసే ఛాన్స్ వచ్చింది. నా దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. నా పేరు లేకుండా మరో నటుడికి (మోహన్ బాబు) అవకాశం రావటంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యాను.
ఆ తర్వాత మళ్లీ గద్దలాగా పాజిటివ్‌గా తీసుకుని ఎదిగాను. ఎవరైతే (దర్శకుడు కే రాఘవేంద్రరావు) చిరంజీవి వద్దులే అని అనుకున్నారో ఆయనతోనే రామారావుగారి కంటే నాలుగు సినిమాలు ఎక్కువగానే చేసేలా చేసుకున్నానని ఈ సందర్బంగా ప్రస్తావంచారు. ఆయనతో చేసిన సినిమానే కోటి రూపాయలు వసూలు చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రారంభంలో లక్ష్య సాధనలో నిలదొక్కుకోవాలి. డబ్బు ప్రధానం కాదు. నిలబడ్డ తర్వాత డబ్బు దానంతట అదే వస్తుంది. నాతో పని చేయని వాళ్లు, మళ్లీ చిరంజీవితో సినిమా చేయాలి అనుకునేలా నా ప్రవర్తన ఉండేది. కాస్త తగ్గటం వల్ల వచ్చే వేవ్స్ ఆటోమెటిక్‌గా నన్ను పైకి తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ అనేది సెకండరీ.. నిర్మాతలతో ఎలా ఉంటావు.. వాళ్లకు ఎలా సపోర్ట్ చేశావనేది చూసుకోవాలి. టాలెంట్‌తో పాటు బిహేవియర్ కూడా ఉండాలి. రామారావుగారు పాలిటిక్స్‌కి వెళ్లిన తర్వాత ఆ గ్యాప్‌లో ఎందరో మహా నటులు.. నాగేశ్వరరావుగారు, శోభన్‌బాబుగ, కృష్ణంరాజు, కృష్ణ వంటి వారు ఉన్నారు. అయితే అప్పుడు ఓ కొత్త వాడికి చాన్స్ రావటం అనేది ఎంత కష్టమైన విషయమో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అందరి ఇన్ స్ప్రేషనల్ స్పీచ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.