BRS Party Leaders Arrest: తెలంగాణలో యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. తన ఫోన్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే బంజారాహిల్స్ సీఐ పారిపోతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనంతరం విధులకు ఆటంకం కల్పించారని చెబుతూ అదే స్టేషన్‌లో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్‌తోపాటు 20 మంది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కూడా నమోదు చేశారు.
Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్ సీఐతో రచ్చరచ్చ
కేసు నమోదు అయిన తర్వాతి రోజే గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అరెస్ట్ వార్త తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తరలివెళ్లారు. అయితే లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలోనే హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: KT Rama Rao: తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు
నాయకుల అరెస్ట్ పరంపర
ఈ వివాదం నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్ తదితరులు ఉన్నారు. తమ నాయకులు ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఏ పని చేసినా కేసు.. కేసు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.