ఢిల్లీలో కరువైన ఓటరు చైతన్యం

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం  70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ శాతం మాత్రం చాలా మేర తగ్గిపోయింది. 

Last Updated : Feb 8, 2020, 05:26 PM IST
ఢిల్లీలో కరువైన ఓటరు చైతన్యం

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం  70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  కానీ పోలింగ్ శాతం మాత్రం చాలా మేర తగ్గిపోయింది. 
 
2015 అంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం బాగా పడిపోయిందనే చెప్పాలి.  ప్రస్తుతం ఢిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్ నమోదైంది. ఐతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో  ఈసారి ఢిల్లీలో ఓటర్లు ఎక్కువగా చైతన్యం చూపించలేదనే చెప్పాలి. దేశానికి గుండెకాయ లాంటి న్యూఢిల్లీలోనే అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. మరోవైపు ఢిల్లీలోని షాహ్ దరా ప్రాంతంలో అత్యధికంగా ఓటింగ్ శాతం రికార్డైంది.   

పోలింగ్ శాతం తగ్గిపోవడం వల్ల గెలుపు, ఓటములపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. ఐతే బాగా చదువుకున్న ఢిల్లీ ఓటర్లలోనే ఓటుపై చైతన్యం ఎందుకు కరువైందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. శనివారం, ఆదివారం.. రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఓటర్లు అంతా స్వస్థలాలకు వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.  ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. రాబోయే కాలంలో ఢిల్లీ గద్దెను ఎవరు అధిష్ఠించి పరిపాలిస్తారో వేచి చూడాలి. ఐతే ప్రధానంగా పోటీ మాత్రం ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

Trending News