న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా ఇన్స్పెక్టర్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి హత్య చేయడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. మహిళా పోలీసు ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రీతి అహ్లావత్ 2018 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. ఢిల్లీలోని పట్పర్గంజ్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 7న) రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు.
Also Read: ఢిల్లీ ఎన్నికలు: ఓటింగ్ ప్రారంభం.. పోటెత్తుతున్న ఓటర్లు
రోహిణి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని యువకుడు ప్రీతి అహ్లావత్‌ను తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మహిళా పోలీసు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. రెండు తూటాలు ఆమె శరీరంలోకి చొచ్చుకెళ్లాయని, మరో తూటా ఆ పక్కనే ఉన్న కారు అద్దాలను ధ్వసం చేసిందని సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు.
Also Read: 5 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం
As per the Police, Sub-Inspector Preeti was walking from Rohini East Metro Station to her home at 9.30 PM, when an unidentified person came, took out a pistol&shot her in her head. She died at the spot.
Police have collected CCTV footage from the area&are examining it. #Delhi https://t.co/0nB0uayQrS
— ANI (@ANI) February 7, 2020
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. తెల్లారితే అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా మహిళా పోలీసు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఓ అత్యాచారం కేసు విచారిస్తున్న ప్రీతికి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హత్య జరిగిందా, లేక ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.