EX CM KCR: మాట ఇచ్చిన గులాబీ బాస్‌.. ఎమ్మెల్సీ సీటు ఆ నేతకే!

KCR Commited MLC Seat: గులాబీ బాస్‌ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో దాసోజు వైపు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. 

Written by - G Shekhar | Last Updated : Nov 18, 2024, 05:18 PM IST
EX CM KCR: మాట ఇచ్చిన గులాబీ బాస్‌.. ఎమ్మెల్సీ సీటు ఆ నేతకే!

KCR Commited MLC Seat: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. కొత్త ఏడాదిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్‌.. శాసన సభ్యులు, గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు..! తెలంగాణలో మరోసారి ఎన్నికల ఫైట్‌కు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. త్వరలోనే శాసనసభ్యుల కోటా, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు రెండు సీట్లు అయినా గెలవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల రాష్ట్రంలో 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. 10 మంది నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో గులాబీ పార్టీకి ఒక్కసీటు మాత్రమే దక్కే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎవరనే చర్చ మొదలైంది. అయితే కారు పార్టీ నుంచి ఆశావాహులు లిస్టు భారీగా ఉండటంతో.. పదవి ఎవరికి దక్కబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే పలువురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు మహబూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాస్‌ రెడ్డి, ఎగ్గే మల్లేశం పదవీ కాలం పూర్తి కాబోతోంది. అటు ఎంఐఎం నేత మిర్జా రియాజ్‌ పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి పదవీ కాలం పూర్తి కానుంది. దాంతో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎమ్మెల్యేల సంఖ్యపరంగా కాంగ్రెస్‌కు ఎక్కువగా దక్కే చాన్స్‌ ఉంది. అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా రెండు సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో గులాబీ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కనుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ సీటు కోసం చాలామంది లీడర్లు పోటీ పడుతున్నారు..

గతంలో బీఆర్‌ఎస్ సర్కార్‌ అధికారంలో ఉండగా.. దాసోజు శ్రవణ్‌కు ఏ పదవి దక్కలేదు. కానీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు గులాబీ బాస్‌ కేసీఆర్‌ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రావణ్‌, బీఆర్‌ఎస్ మరో నేత సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించారు. కానీ.. చివరి నిమిషంలో గవర్నర్‌ తమిళిసై వీరిద్దరీని రిజెక్ట్‌ చేశారు. దాంతో చట్టసభలకు అడుగుపెట్టాలన్న దాసోజు కల కలగానే మిగిలిపోయింది. అప్పట్లో ఈ విషయమై గవర్నర్‌కు- కేసీఆర్‌కు మధ్య పెద్ద వివాదమే జరిగింది. ఆ తర్వాత కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో.. నేతలంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి దాసోజు శ్రావణ్‌కు కేసీఆర్ మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దాసోజుకు మండలికి పంపడం ద్వారా రేవంత్ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టొచ్చని భావిస్తున్నారట. ఇదే సమయంలో బీసీ లీడర్‌కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అనుకుంటున్నారట.

మరోవైపు ఎమ్మెల్సీ రేసులో మరికొందరు లీడర్లు సైతం ఉన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మైనారిటీ కోటా మహమూద్‌ అలీ సైతం ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారట. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా మహమూద్‌ అలీకి పేరుంది. అటు ఉద్యోగ సంఘాల కీలక నేత కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా సేవలందించిన దేవి ప్రసాద్‌ సైతం ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారట. మరోవైపు గులాబీ నేత, యువ లీడర్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్ గౌడ్‌ కూడా ఎమ్మెల్సీ సీటును కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లీడర్ల పేర్లన్నీ గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటున్న కేసీఆర్‌ ఎమ్మెల్సీ సీటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కేసీఆర్ తీసుకునే నిర్ణయమే అంతిమమని పార్టీ నేతలంతా భావిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: Ramamurthy Naidu: సీఎం చంద్రబాబు ఇంట తీవ్ర విషాదం.. సోదరుడు కన్నుమూత..

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News