AP Pention: పెన్షనర్లకు ఊహించని శుభవార్త.. ఏపీ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి గిఫ్ట్..

AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.

1 /7

AP Pention: ఏపీలో బడుగు, బలహీన వర్గాలు, ముసలి, ముతక సహా చాలా మంది బీదలకు ప్రభుత్వం అందంచే పింఛనే ఆధారం. ప్రభుత్వం అందించే పింఛనుతోనే ఇంట్లో వారికంటూ ఓ గౌరవం దక్కుతోంది. అయితే ఏదో పని ఉండి ఒక నెల పించను తీసుకోని వాళ్లకు ఆ నెల పింఛను పోయినట్టే.

2 /7

ఈ విషయమై ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. వరుసగా రెండు నెలలు తీసుకోలేకపోతే.. ఆ తర్వాత నెలలో మూడు నెలలకు కలిపి మొత్తం 12వేలు అందిచనుంది. ఈ హామీ అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

3 /7

సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిసెంబరు నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్‌లో పింఛన్ అందుకోలేనివారు డిసెంబరు 1న రెండు నెలలది కలిపి  ఇస్తామంటున్నారు.  

4 /7

నవంబరులో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛను తీసుకోలేదని సమాచారం. వీరికి వచ్చే నెల అంటే డిసెంబర్ 1న అందజేస్తారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ విధానం అమలైందన్నారు.

5 /7

గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌ దీన్ని రద్దుచేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో పింఛన్‌లు తీసుకునేవారు ఇబ్బందిపడ్డారు. దీంతో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. 

6 /7

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా కింద ప్రభుత్వం 64.14 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది. ప్రతి నెలా పింఛను ఇచ్చే సమయానికి కొందరు వృద్ధులు  వేరే ఊళ్లో ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వారు వివిధ కారణాల వల్ల  పింఛన్ తీసుకోలేకపోయారు.

7 /7

గత నెల వరకూ వారు ఏ నెలకు, ఆ నెల పింఛన్‌ తీసుకువాల్సిన పరిస్థితి ఉంది. దానిని గమనించిన కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం  ఆ హామీని నిలబెట్టుకుంటోంది.