Tuni Driver Suspension: విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చిన కండక్టర్‌ను విధుల్లోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. నారా లోకేశ్ స్పందించిన అనంతరం అతడిని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ అతడిని సస్పెండ్ చేయడంతో నారా లోకేశ్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి రీల్స్ మెచ్చుకోగా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం విధుల్లో నుంచి తొలగించడం తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన లోకేశ్ స్పందించారు. అతడిని తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు.
డ్యూటీలో ఉండగా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా సస్పెండ్‌కు ముందే అతడి వీడియోను లోకేశ్చూసి మెచ్చుకోవడంతో అతడు ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కాకినాడ జిల్లా తునికి చెందిన ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ లోవరాజు ఆటవిడుపుగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటాడు. ఇంటి వద్ద.. ఆరు బయట కొద్దిగా ఖాళీ సమయం లభిస్తే చాలు అతడు రీల్స్‌తో బిజీగా ఉంటాడు.
Also Read: APSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగాల భర్తీ, ఏయే ఉద్యోగాలంటే
నాలుగు రోజుల కిందట లోవరాజు డ్యూటీలో ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని గిలియే పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేశాడు. ఆ వీడియోను చూసిన లోకేశ్ 'సూపర్ బ్రదర్' అంటూ మంత్రి 'ఎక్స్'లో పోస్ట్ చేసి అభినందించారు. అయితే డ్యూటీలో ఉండగా బస్సు ముందు రీల్స్ చేయడాన్ని ఏపీఎస్ఆర్టీసీ తప్పుగా పరిగణించింది. వెంటనే తుని ఆర్టీసీ డిపో అధికారులు కాంట్రాక్ట్ డ్రైవర్ లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించి వేశారు.
రీల్స్ కారణంగా తన ఉద్యోగం పోవడంతో డ్రైవర్ లోవరాజు తీవ్ర ఆందోళన చెందాడు. ఇదే విషయాన్ని నెటిజన్లు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. తక్షణమే లోవరాజును తిరిగి విధుల్లోకి తీసుకుంటారని తెలిపారురు. అయితే విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేయలేదని.. రోడ్డుపై ట్రాక్టర్ అడ్డువచ్చి చాలా సేపు బస్సు నిలిచిపోతే ఆ విరామంలో రీల్స్ వీడియో చేసినట్టు లోవరాజు చెబుతున్నాడు. అతడికి వెంటనే ఉద్యోగం ఇస్తామని, సస్పెన్షన్ ఎత్తివేస్తానంటూ లోకేశ్ స్పందించడంతో మరోసారి లోవరాజు ట్రెండింగ్‌లోకి వచ్చాడు. తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో లోవరాజు హర్షం వ్యక్తం చేశాడు.
The suspension orders will be revoked, and he will be taken back to work immediately. I will meet him personally when I come back 😊 https://t.co/netfEfeAo3
— Lokesh Nara (@naralokesh) October 28, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.