Liquor Lorry: రోడ్డుపై ఫుల్‌ లోడ్‌ మద్యం లారీ బోల్తా.. సీసాలకు సీసాలు లూటీ

Liquor Container Met An Accident: ఫుల్‌ లోడ్‌తో వెళ్తున్న మద్యం కంటైనర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. మద్యం సీసాలు బయటపడడంతో స్థానికులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం ఖాళీ అయ్యింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 24, 2024, 01:15 AM IST
Liquor Lorry: రోడ్డుపై ఫుల్‌ లోడ్‌ మద్యం లారీ బోల్తా.. సీసాలకు సీసాలు లూటీ

Liquor Container: మద్యం లోడ్‌తో నిండుగా ఉన్న కంటైనర్‌ హైదరాబాద్‌కు తరలించేందుకు వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. వెనుక నుంచి లారీలు ఢీకొట్టడంతో ఆగి ఉన్న మద్యం లారీ ప్రమాదానికి గురయ్యింది. దీంతో కంటైనర్‌ దెబ్బతినడంతో మద్యం కాటన్లన్నీ బయటకు పడ్డాయి. ఇది చూసిన వాహనదారులు మద్యం కోసం ఎగబడ్డారు. కాటన్లు కాటన్లు.. సీసాలకు సీసాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు నీటి సరఫరా బంద్

 

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్లలో హైదరాబాద్‌ -బెంగళూరు జాతీయ రహదారి నంబర్‌ 44పై మద్యం కంటైనర్‌తోపాటు మరికొన్ని లారీలు నిలిచి ఉన్నాయి. బుధవారం రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆగి ఉన్న లారీలను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో ఆ లారీతోపాటు మిగతా లారీలు కూడా బోల్తా పడ్డాయి. బోల్తా పడిన లారీల్లో మద్యం లోడుతో ఆగి ఉన్న కంటైనర్ కూడా బోల్తాపడింది. దీంతో కంటైనర్‌లోని మద్యం బాటిళ్లు మొత్తం చెల్లాచెదరయ్యాయి. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులతోపాటు స్థానికులు మద్యం కోసం ఎగబడ్డారు. ఒక్కసారిగా ప్రజలు ఎగబడడంతో కంటైనర్‌లోని మద్య భారీగా లూటీ అయినట్లు తెలుస్తోంది.

Also Read: Tirumala Letter: తిరుమలపై మళ్లీ రెచ్చిపోయిన తెలంగాణ ఎమ్మెల్యే.. ఈసారి చంద్రబాబును అడ్డుకుంటామని వార్నింగ్‌

 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మద్యం సీసాలను ప్రజలు భారీగా తీసుకెళ్లిపోయారు. పెబ్బేరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తతో నడపంతోనే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎవరికీ ఏమీ కాలేదు. డ్రైవర్లు మాత్రం కాస్త గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రమాదంలో మద్యం లూటీ సంఘటనపై సంబంధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. మద్యం ఎంత మేర నష్టపోయారో మద్యం వ్యాపారులు చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News