Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ తినకూడని, తినాల్సిన ఆహారపదార్థాలు ఇవే...

Diabetes Healthy Foods: షుగర్ సమస్యతో బాధపడేవారు కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అనేది తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 23, 2024, 02:29 PM IST
Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ తినకూడని, తినాల్సిన ఆహారపదార్థాలు ఇవే...

Diabetes Healthy Foods: డయాబెటిస్‌ ఉన్నవారు ఆహారం తీసుకోనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జంక్‌ ఫూడ్స్‌, చక్కెర ఎక్కువగా ఉండే పదార్ధాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. కాబట్టి వైద్యలు కొన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ లెవెల్స్‌ తగ్గుతాయి అనేది మనం తెలుసుకుందాం. 

డయాబెటిస్‌ ఉన్నవారు ఆకు కూరలు, పండు, తృణధాన్యాలు తీసుకోవడం మంచి ఎంపిక. ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, పోషకాలు, విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. పండ్లు తినాలి అనుకొనేవారు యాపిల్‌, పెయిర్స్‌, బెర్రీలు, ఆరెంజ్‌, ద్రాక్ష, అరటి పండు వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో షుగర్‌ లెవెల్స్‌ను కొంట్రోల్‌ చేసే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కూరగాయల్లో బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్‌, క్యారెట్‌, వంకాయ తినడం శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్‌ లు షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. అకు కూరలు, పండ్లు మాత్రమే కాకుండా ధాన్యాలు తినడం వల్ల ఎముకలు, శరీరం దృఢంగా తయారు అవుతుంది. ముఖ్యంగా బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌, క్వివోవా, బార్లీ వంటి ధాన్యాలు తినడం వల్ల షుగర్‌ అదుపులో ఉంటుంది. సహాజంగా షుగర్ లెవెల్స్‌ కంట్రోల్‌ చేయడం వల్ల ఎలాంటి మందులను ఉపయోగిచాల్సిన అవసరం లేదు. చేప, చికెన్, టర్కీ, గుడ్లు, బీన్స్, లెంటిల్స్ వంటి పదార్ధాలు షుగర్‌ సమస్య ఉన్నప్పుడు వచ్చే వ్యాధులను తగ్గిస్తాయి. 

ఎందుకు ఈ ఆహారాలు మంచివి:

ఈ పదార్ధాల్లో ఫైబర్‌ , ప్రోటీన్‌ ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది షుగర్ స్థాయిలను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. ప్రోటీన్‌ ఫూడ్స్‌ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి.

అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సోడా, జ్యూస్, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటి వల్ల జీర్ణక్రియ వ్యవస్థత దెబ్బతింటుంది.  వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా కూడా తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, సాసేజ్, ప్యాక్ చేసిన స్నాక్స్ తింటే గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయి.

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News