EPS 95 Pension: EPS 95 హయ్యర్ పెన్షన్ అప్లై చేస్తున్నారా..అయితే మిస్టేక్స్ జరిగితే మీ అప్లికేషన్ మధ్యలోనే నిలిచిపోయే అవకాశం..?

EPS 95 Pension Scheme: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం హయ్యర్ పెన్షన్ ఇంకా అప్లై చేయలేదా..లేదా అప్లికేషన్లో లోపాలు ఉన్నాయా.. వాటిని ఆన్లైన్ ద్వారా ఎలా సరిదిద్దుకోవచ్చు.. ఎవరిని కలిస్తే పని అవుతుంది అలాంటి విషయాలు తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Oct 16, 2024, 07:23 PM IST
EPS 95 Pension: EPS 95 హయ్యర్ పెన్షన్ అప్లై చేస్తున్నారా..అయితే మిస్టేక్స్ జరిగితే మీ అప్లికేషన్ మధ్యలోనే నిలిచిపోయే అవకాశం..?

EPS 95 Pension Scheme: సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు అతి త్వరలోనే శుభవార్త లభించనుంది. హయ్యర్ పెన్షన్ కు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఉద్యోగులు, పెన్షన్ దారులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఇప్పటికే పలుమార్లు గడువు తేదీని పొడిగించింది. మీరు ఇప్పటికీ హయ్యర్ పెన్షన్ కు సంబంధించిన అప్లికేషన్ ఇంకా ఫిల్ చేయకపోయినా.. లేదా తప్పుగా నింపిన సరి చేసుకునే అవకాశం ఇంకా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 

EPS పెన్షన్ స్కీమ్ 1995 కింద దాదాపు 97,640 మంది ప్రావిడెంట్ ఫండ్ PF సభ్యులు, పెన్షనర్లు దేశవ్యాప్తంగా హయ్యర్ పెన్షన్ ద్వారా లబ్ది పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిలో 8,401 మందికి చెందిన పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను (PPOలు) సెప్టెంబర్ 10, 2024 నాటికి స్వీకరించారు. 89,235 మంది డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయితే మీలో కొంత మంది ఇప్పటికీ హయ్యర్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) అప్లికేషన్ సరిగ్గా నింపకపోతే మీరు ఆన్లైన్ ద్వారా ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: free scooty yojana 2024: మహిళలకు  ఫ్రీ స్కూటీ పథకం... మోదీ సర్కార్ బంపర్ ఆఫర్  

ఆన్ లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను ఇలా సమర్పించండి:

-EPFO వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ UAN ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి.

- మీ ప్రొఫైల్ కింద "పెన్షన్ స్టేటస్" విభాగానికి వెళ్లండి.

-అందులో ఏమేం అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

కొన్ని సందర్భాల్లో మీ యాజమాన్యం మీ తరఫున పంపాల్సిన దరఖాస్తులను పంపకపోవడం వల్ల కూడా హయ్యర్ పెన్షన్ నిలిచిపోతుంది. అందుకే ముందుగా మీరు యాజమాన్యం తరఫున సమర్పించవలసిన దరఖాస్తులు ఏమేమి ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ప్రాసెస్ ముందుకు పడుతుంది. ఇందుకోసం మీరు మీ కంపెనీ హెచ్ఆర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు హయర్ పెన్షన్ కు అర్హులు అవునో కాదో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ ద్వారా మీ దరఖాస్తులు సరిగా అప్డేట్ కాకపోతే మీ ప్రాంతీయ EPFO ​​కార్యాలయంతో నేరుగా సంప్రదించడం సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.  మీరు కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించవచ్చు లేదా ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతి ప్రాంతీయ కార్యాలయం EPFO ​​వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన సంప్రదింపు వివరాలను కలిగి ఉంటాయి. వారితో నేరుగా కనెక్ట్ చేయడం ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

Also Read: Fuel Saving Tips For Bike Riders : బైక్ నడిపే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..మైలేజీ పెరగడం పక్కా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News