DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడింది.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపును ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2024, 02:40 PM IST
DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది. డీఏను ఊహించినట్టే 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై నెల డీఏ పెంపు 3 శాతానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నెల జీతంతో ఉద్యోగులకు ఎరియర్లతో కలిపి అందనుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ పెంపు 3-4 శాతం ఉంటుందని అంచనా వేశారు. అందుకు తగ్టట్టే కేంద్ర కేబినెట్ డీఏను 3 శాతం పెంచింది. ఏడాదికి రెండు సార్లు డీఏ పెంచుతుంటారు. జనవరి నెల డీఏను 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతమైంది. ఇప్పుడు జూలై నెల డీఏను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఎరియర్లతో పాటు అక్టోబర్ నెల జీతంతో చెల్లించనున్నారు. అంటే అక్టోబర్ నెల జీతం పెద్దఎత్తున ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో పెరగాల్సిన డీఏ పెంపుపై ఇవాళ ప్రకటన వెలువడటంతో అక్టోబర్ జీతం భారీగా ఉండనుంది. అంటే 18 వేల రూపాయలు కనీస వేతనం ఉంటే 540 రూపాయలు డీఏ పెరగనుంది. 

జీతం ఎవరికి ఎంత పెరుగుతుంది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేలుండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 540 రూపాయలు ఏడాదికి 6,480 రూపాయలు పెరుగుతుంది. అదే 4 శాతం పెరిగితే నెలకు 720 రూపాయలు ఏడాదికి 7440 రూపాయలు పెరుగుతాయి. ఇక నెలకు 50 వేలు కనీస వేతనం ఉండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 1500 రూపాయలు ఏడాదికి 18 వేలు అందుతాయి. ఉద్యోగుల స్థాయి కనీస వేతనం బట్టి ఎవరికి ఎంత పెరుగుతుందనేది ఉంటుంది. డీఏ, డీఆర్ పెంపుతో దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 

Also read: Flash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News