Lokesh: వైఎస్‌ జగన్‌ తరిమేసిన పరిశ్రమలన్నీ ఏపీకి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh Ribbon Cuts To KIA Showroom: తరలివెళ్లిన పరిశ్రమలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ కౌంటర్‌ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 11, 2024, 03:51 PM IST
Lokesh: వైఎస్‌ జగన్‌ తరిమేసిన పరిశ్రమలన్నీ ఏపీకి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్‌

Andhra Pradesh Industries: ఏపీకి టీసీఎస్ పరిశ్రమను తానే తీసుకువచ్చినట్లు మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఆయన తరిమేసిన పరిశ్రమలన్నింటిని తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తానని ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని పేర్కొన్నారు. అనేక పరిశ్రమలు ఇక్కడ పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

Also Read: Priests: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో అధికారులకు చెక్‌ పూజారులదే అధికారం

 

మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్‌ను శుక్రవారం లోకేశ్‌ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గతంలో కూడా చంద్రబాబు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ గుర్తుచేశారు. ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్‌కు ఆత్మ చెప్పినట్లుంది.. ఆయనే తీసుకువచ్చాడని చెబుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలని సవాల్‌ విసిరారు.

Also Read: Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతు

 

మళ్లీ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్‌ తెలిపారు. అందులో భాగంగానే టీసీఎస్, లులు వచ్చాయని గుర్తుచేశారు. గతంలో జగన్ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తామని పునరుద్ఘాటించారు. 'రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సర్వీసింగ్ ఉత్తరాంధ్రకు తీసుకువస్తాం. పవన, కాంతి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు కర్నూలుకు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ కడప, చిత్తూరుకు, ఆటోమొబైల్స్ అనంతపురానికి తీసుకువస్తాం. ఉభయగోదావరికి ఆక్వా, పెట్రో కెమికల్ పరిశ్రమలు తీసుకువస్తాం. కృష్ణా, గుంటూరులో అనేక పెట్టుబడులు తీసుకువస్తాం. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం' అని లోకేశ్‌ వివరించారు.

తనపై బ్లూ బుక్, గుడ్ బుక్ అంటున్న వైసీపీపై లోకేశ్‌ స్పందిస్తూ.. 'నన్ను చూసి వైసీపీ స్ఫూర్తి పొందినట్లు ఉంది. రెడ్ బుక్ చూపించి.. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇప్పటికే యాక్షన్ మొదలైంది. వైసీపీ వేరే పుస్తకాలు పెడితే పెట్టుకోనివ్వండి.. మాకేం భయం లేదు' అని పేర్కొన్నారు. వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ మాదిరిగా మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. వరదలు వస్తే జగన్ కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటలేదు' అని విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News