Tomato Roti Pachadi: నోరూరించే తెలంగాణ స్టైల్‌లో టమాటో పచ్చడి రెసిపీ.. ఒక్కసారి తింటే మళ్లీ తింటారు!

Tomato Roti Pachadi: టమాటో పచ్చడి అంటే ఇష్టపడని వారెవరుంటారు. అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చాలామందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలీదు. దీనికి సంబంధించిన తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 5, 2024, 02:22 PM IST
Tomato Roti Pachadi: నోరూరించే తెలంగాణ స్టైల్‌లో టమాటో పచ్చడి రెసిపీ.. ఒక్కసారి తింటే మళ్లీ తింటారు!

Tomato Roti Pachadi: తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది అన్నం తినే క్రమంలో తప్పకుండా పచ్చడితో మొదటి ముద్ద తిన్న తర్వాతే మిగతా కర్రీలతో తింటూ ఉంటారు.  పచ్చళ్ళు అనేవి భారతీయ వంటకాల్లో అద్భుతమైన రెసిపీలు.. ఇవి దాదాపు 500 ఏళ్ల సంవత్సరాల నుంచే వస్తున్నాయని అనేక పుస్తకాల్లో క్లుప్తంగా పేర్కొన్నారు. నిజానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కూరగాయతో తయారుచేసిన పచ్చళ్ళను తినేందుకు ఇష్టపడతారు. అయితే అందరూ ఎంతగానో ఇష్టపడే పచ్చడి ఏదైనా ఉందంటే అది కేవలం టమాటో పచ్చడే.. అందరూ ఈ పచ్చడిని ఎంతో ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. అంతేకాదు ఈ పచ్చడితో పులిహోర, పోపు రైస్ కూడా తయారు చేసుకుంటారు. ఇది నోటికి పుల్లదనాన్ని అందించడమే కాకుండా అద్భుతమైన టేస్టును కలిగి ఉంటుంది. అందుకే చాలామంది జలుబు సమస్యలతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ టమాటో పచ్చడితో తింటూ ఉంటారు. నిజానికి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలీక చాలామంది హోటల్స్ తో పాటు సూపర్ మార్కెట్లో ఎక్కువగా కొంటూ ఉంటున్నారు. ఇకనుంచి ఇలా కొననక్కర్లేదు మేము అందించే ఈ సులభమైన పద్ధతిలో అద్భుతమైన టేస్ట్ తో టమాటో పచ్చడిని ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో.. కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టమాటో పచ్చడి తయారీ విధానం:
టమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు:
పండిన టమాటోలు - 1 కిలో
ఎండు మిరపకాయలు - 10-12
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు - 5-6
ఉప్పు - రుచికి సరిపోతుంది
నూనె - వేయించడానికి సరిపోతుంది
ఆమ్చూర్ పౌడర్ - 1/2 టీస్పూన్ ( కావలసినంత)
గరం మసాలా - 1/4 టీస్పూన్ (రుచికి సరిపడా) 

తయారీ విధానం:

  • ఈ పచ్చడిని తయారు చేయడానికి ముందుగా టమాటోలను తీసుకుని ఒక బౌల్లో వేసుకొని నీట్ గా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. 
  • ఆ తర్వాత ఎండు మిరపకాయలను నీటిలో నానబెట్టి వాటి తొక్కల తో పాటు గింజలను తీసి మిశ్రమంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటి పై పొట్టు తీసి గ్రైండర్లో వేసి పేస్టులా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకును తీసుకొని కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. 
  • ఆ తర్వాత స్టౌ పై ఓ పెద్ద బౌల్ పెట్టుకొని అందులో పచ్చడికి తగిన మోతాదులో నూనె వేసుకొని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. 
  • ఆ తర్వాత పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాలన్నిటినీ వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత టమాటోలను వేసుకొని బాగా ఉడకనివ్వాలి. 
  • టమాటాలు బాగా ఉడికిన తర్వాత కావాల్సిన మసాలాలు వేసుకొని మరికొద్ది సేపు మగ్గనివ్వాలి. 
  • ఇలా మగ్గిన మిశ్రమాన్ని చల్లార్చి గ్రైండర్ జార్లో వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే సులభంగా టమాటో పచ్చడి రెడీ అయినట్లే..

చిట్కాలు:

  1. ఈ టమాటో పచ్చడిని తయారు చేసుకునే క్రమంలో మీ దగ్గర పండిన టమాటోలు లేకుంటే వాటికి సంబంధించిన ప్యూరీని కూడా వినియోగించవచ్చు. 
  2. టమాటా పచ్చడిలో కొంచెం చక్కెర వేసుకుంటే రుచి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 
  3. అలాగే ఈ పచ్చడిని తయారు చేసే క్రమంలో బగారా మసాలాను కూడా వినియోగించవచ్చు. వీటిని వినియోగిస్తే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News