విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ కు చెక్ పెట్టాలన్న కోహ్లీ ప్లాన్ ఫలించిందా ? అంటే ఔననే చెప్పాల్సి వస్తుంది మరి. తొలి టెస్టులో రోహిత్ శర్మను పక్కనపెట్టడంపై కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే రోహిత్ ను ఎందుకు ఆడించలేదన్న మాజీల ప్రశ్నలకు టీమిండియా కోహ్లి మాత్రం గెలుపుతో సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం జట్టు సాధరిగా కోహ్లీ మాట్లాడుతూ రహానే, విహారీలపై ప్రశంసల జల్లు కురిపించాడు. వారిద్దరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని .. అద్భుతంగా రాణించి జట్టులో కొనసాగేందుకు అన్నివిధాలుగా అర్హులని తెలిపాడు. ఇలా తదుపరి మ్యాచ్ లో రోహిత్ ను దూరం పెట్టాతామని కోహ్లీ ఇలా పరోక్షంగా వెల్లడించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తొలి టెస్టు మ్యాచ్ టీమిండియా విజయం సాధించడంతో జట్టు సారథి కోహ్లీ బతికిపోయాడు లేకుంటే రోహిత్ ను పక్కన పెట్టినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదనే వాదన కూడా వినిపిస్తోంది. రెహానే, విహారీల విషయం ఒకే..మరి ఓపెనర్ మయాంక అగర్వాల్ ఫెయిల్ అయ్యాడు కదా..మరి ఆ స్థానంలో రోహిత్ ను తీసుకునే అవకాశం అయితే ఉంది. మళ్లీ ఈ విషయంలో కోహ్లీ ఏలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి. తొలి టెస్టులో విఫలమైన మయాంక్ అగర్వాల్ ను ఏదైన కారణం చెప్పి కోహ్లీ అతన్నే సమర్థిస్తాడా ? లేదా ఆ స్థానంలో రోహిత్ ను తీసుకునేందుకు మొగ్గుచూపుతాడా అనేది దానిపై ఉత్కంత నెలకొంది.
వరల్డ్ కప్ సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం నెలకొందని కథనాలు వెలువడ్డాయి. ఒకనొక సందర్భంలో విండీస్ టూర్ కు దూరంగా ఉండాలని భావించిన కోహ్లీ సడన్ గా నిర్ణయం మార్చుకొని విండీస్ టూర్ కు వచ్చేశాడు. రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకూడదనే ఉద్దేశంతో కోహ్లీ ఇలా చేశాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. విండీస్ టూర్ లో కెప్టెన్సీ విషయం అటు ఉంచితే కనీసం టెస్టు జట్టులో రోహిత్ కు కనీసం స్థానం కూడా దక్కలేదు..ఇందతా కోహ్లీ మైండ్ గేమ్ లో భాగమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలు వాస్తవాలు కాదని నిరూపించాలంటే అద్భుత ఫాంలో ఉన్న రోహిత్ ను తుది జట్టులో తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో కోహ్లీ ఏం చేస్తాడో మరి.