శ్రీలంక పేలుళ్లలో 129కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంక పేలుళ్లలో 129 మందికి చేరిన మృతుల సంఖ్య

Last Updated : Apr 21, 2019, 02:16 PM IST
శ్రీలంక పేలుళ్లలో 129కి చేరిన మృతుల సంఖ్య

కొలంబొ: శ్రీలంక వరుస పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య 129కి చేరింది. 300కి పైగా మంది గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. శ్రీలంక రాజధాని కొలంబో, నగొంబో, బట్టికలోవ పట్టణాల్లో మూడు చర్చిలు, మరో మూడు హోటల్స్ లో ఆదివారం ఉదయం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బట్టికలోవలోని ఓ చర్చితోపాటు కొలంబోలోని కొచ్చికడే వద్జ వున్న సెయింట్ ఆంథోని చర్చి, కతువపిటిలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలలో పేలుళ్లు జరిగాయి. ఈస్టర్న్ వేడుకల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడమే అధిక ప్రాణనష్టానికి కారణమైందని తెలుస్తోంది. 

చర్చిలలో పేలుళ్ల అనంతరం కొలంబోలోని షంగ్రి ల హోటల్, సిన్నమాన్ గ్రాండ్, కింగ్స్‌బరి హోటల్స్ వద్ద వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారిలో, గాయపడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. అయితే, అందులో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనే సమాచారం మాత్రం ఇంకా వెల్లడవలేదు.

Trending News