Healthy Heart Tips: గుండెపోటు చాలా ప్రమాదకరమైంది. మొదటి సారి గుండెపోటు ఎదురయ్యాక మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. మనిషి బాడీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అంటే వ్యాయామం ఒక్కటే మార్గం కాదు. రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందులో ఒకటి మెట్లెక్కడం.
రోజూ ఆఫీసులో లేదా ఇంట్లో మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే కండరాలు బలోపేతమవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది. ప్రత్యేకించి హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తదు. అయితే రోజూ ఎన్ని మెట్లెక్కాలనేది కూడా ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవల్సిన అంశం. ప్రతి రోజూ 50 మెట్లు ఎక్కడం చేస్తుంటే గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇతరులతో పోలిస్తే మెట్లెక్కేవారిలో గుండె పోటు ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుంది. కొంతమందికి జిమ్ లేదా వాకింగ్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఎక్సర్‌సైజ్. ఆపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్థులో ఉండేవాళ్లు లిఫ్ట్ వాడకుండా రోజంతా మెట్ల ద్వారానే వెళ్లడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. దీనివల్ల మీ శరీరంలోని కార్బొహైడ్రేట్లు ఓ క్రమపద్ధతిలో బర్న్ అవడం జరుగుతుంది.
మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ఉండే హై డెన్సిటీ లిపో ప్రోటీన్ పెరుగుతుంది. దీనినే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అదే సమయంలో ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెలో ఎలాంటి బ్లాకేజెస్ ఏర్పడవు. గుండె పోటు సమస్య తగ్గుతుంది. లిఫ్ట్ కాకుండా మెట్లు వాడటం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా స్థూలకాయం సమస్య కూడా పోతుంది. జాయింట్స్ గట్టి పడతాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. అలా అని కేవలం మెట్లెక్కడం వల్లనే గుండె పోటు సమస్య తగ్గిపోవడం ఉండదు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన ఆహారం, తగిన నిద్ర, ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం అవసరం. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
Also read: Uric Acid: యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆర్ధరైటిస్‌కు దారి తీస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook