న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ తాజాగా 36 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఏపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి చోటు దక్కించుకోగా రెండో జాబితాలో ఏపీ నుంచి 23 మంది లోక్ సభ అభ్యర్థులకు పోటీచేసే అవకాశం దక్కింది. మహారాష్ట్ర నుంచి ఆరుగురు, ఒడిషా నుంచి ఐదుగురు, అస్సాం, మేఘాలయ నుంచి ఒక్కో అభ్యర్థికి రెండో జాబితాలో చోటు కల్పించారు.
ఏపీ నుంచి పోటీచేయనున్న లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇలా వుంది.
అరకు (ఎస్టీ) -కెవివి సత్యనారాయణ రెడ్డి
శ్రీకాకుళం - పెర్ల సాంబమూర్తి
విజయనగరం - పి సన్యాసిరాజు
అనకాపల్లి - డా జి వెంకట సత్యనారాయణ
కాకినాడ - యల్ల వెంకట రామ్మోహన రావు (దొరబాబు)
అమలాపురం (ఎస్సీ) - అయ్యాజి వేమ మానేపల్లి
రాజమండ్రి - సత్య గోపినాథ్ దస్పరవాస్తు
నర్సాపురం - పైడికొండ మాణిక్యాల రావు
ఏలూరు - చిన్నం రామకోటయ్య
మచిలీపట్నం - గుడివాక రామాంజనేయులు
విజయవాడ - దిలీప్ కుమార్ కిలారు
గుంటూరు - వల్లూరు జయప్రకాశ్ నారాయణ
బాపట్ల (ఎస్సీ) - డా చల్లగాలి కిషోర్ కుమార్
ఒంగోలు - తోగుంట శ్రీనివాస్
నంద్యాల - డా ఆదినారాయణ ఇంటి
కర్నూలు - డా పివి పార్థసారథి
అనంతపూర్ - హంస దేవినేని
హిందూపూర్ - పోగల వెంకట పార్థసారధి
కడప - సింగరెడ్డి రామచంద్రా రెడ్డి
నెల్లూరు - సురేష్ రెడ్డి సన్నపరెడ్డి
తిరుపతి (ఎస్సీ) - బొమ్మి శ్రీహరి రావు
రాజంపేట్ - పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి
చిత్తూరు (ఎస్సీ) - జయరాం దుగ్గని