Chandrababu Rare Records: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు పేరిట పలు అరుదైన రికార్డులు.. భవిష్యత్తులో మరొకరికి సాధ్యం కాదేమో..!

Chandrababu Rare Record: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ రోజు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి  ఏపీ సహా విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎంగా.. ప్రతిపక్ష నేతగా ఓ రికార్డు నెలకొల్పారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2024, 07:20 AM IST
Chandrababu Rare Records: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు పేరిట పలు అరుదైన రికార్డులు..  భవిష్యత్తులో మరొకరికి సాధ్యం కాదేమో..!

Chandrababu Rare Record: ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విభిజిత ఏపీలో తొలిసారి ముఖ్యమంత్రిగా.. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2 సార్లు 1995 -2004 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2004-2014 వరకు 10 యేళ్ల సుధీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఒక రంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా.. ఎక్కువ రోజులు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరిట రికార్డు నమోదు అయింది. బహుశా ఈ రికార్డును ఎవరు అధిగించలేరనే చెప్పాలి. మొత్తంగా ఉమ్మడి, విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో 15 యేళ్లు ప్రతిపక్ష నేతగా రికార్డు క్రియేట్ చేసారు. ముఖ్యమంత్రిగా దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అంతేకాదు 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు అప్పటి టి.అంజయ్య మంత్రివర్గంలో క్యాబినేట్ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 1989 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు చంద్రబాబు నాయుడు సొంతం. ఈ రికార్డు ప్రస్తుతం ఏపీ సహా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏ నాయకుడికి లేదు. మొత్తంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా చంద్రబాబు నాయుడు సొంతం.

అంతేకాదు 1975లో రాజకీయ అరంగేట్రం చేసిన  చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంత సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు ఏపీ అసెంబ్లీలో ఎవరు లేరు. మరోవైపు 45 యేళ్ల అతిపిన్న వయసులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన రికార్డు చంద్రబాబు పేరిట ఉంది. అంతేకాదు ప్రస్తుతం 74 అతిపెద్ద వయసులో కూడా సీఎం కాబోతున్న రికార్డు కూడా చంద్రబాబు నాయుడు సొంతం.

అంతేకాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో  చంద్రబాబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉన్నారు. అంతేకాదు చంద్రబాబాబు సీఎంగా ఉన్నపుడు వైయస్ తనయుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇలా తండ్రీకుమారులు ఇద్దరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.వాళ్లు సీఎం అయినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం గమనార్హం. అంతేకాదు 1995 నుంచి ఇప్పటి వరకు గత 29 యేళ్లు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉండటం కూడా ఓ రికార్డు.

2024 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 135 సీట్లను గెలచుకున్నారు. గత 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితయ్యారు. ఈ సారి రికార్డు స్థాయిలో 112 సీట్లను ఎక్కువ గెలవడం కూడా ఓ రికార్డు అని చెప్పాలి. మొత్తంగా ఈ సారి ఏపీలో కూటమిగా 166 సీట్లను గెలచుకొని చారిత్రక విజయాన్ని అందుకున్నారు. ఫస్ట్ టైమ్ మినహా..గెలిచిన మూడు సార్లు చంద్రబాబు నాయుడు కూటమిగానే సీఎంగా అధికారంలోకి వచ్చారు. మొత్తంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సహా విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా.. ఎమ్మెల్యేగా.. చంద్రబాబు క్రియేట్ చేసిన రికార్డులు భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదేమో.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News