Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు

Gurukul Candidates And Staff Nurse Protest In Front Of CM Revanth Reddy House: ధర్నాలతో రేవంత్‌ రెడ్డి నివాసం దద్దరిల్లింది. తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు రేవంత్‌ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 11, 2024, 04:25 PM IST
Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్‌ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు

Revanth Reddy House: అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. వరుసగా ధర్నాలు చేయడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డి నివాసం ధర్నా చౌక్‌గా మారుతోంది. గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Teachers Transfers: టీచర్లకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌.. బదిలీలు, ప్రమోషన్స్‌కు షెడ్యూల్‌ విడుదల

మోకాళ్లపై నిరసన
గురుకుల నియామకాల్లో అవకతవకలు జరగాయంటూ ముఖ్యమంత్రి నివాసం ముందు గురుకుల అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. మోకాళ్లపై కూర్చొని గురుకులాల అభ్యర్థులు నిరసన తెలిపారు. గురుకుల బోర్డ్ తీరుతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మీ తప్పులను తమపై రుద్దవద్దని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సరైన పద్దతిలో నియామకాలు చేపట్టకపోవడంతో ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. దాని ద్వారా చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని వివరించారు. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయమై తాము కోర్టుకు కూడా వెళ్లినట్లు చెప్పారు. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా  ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతుండడంతో వెంటనే తమకు న్యాయం చేయాలని.. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Also Read: King Cobra: హైదరాబాద్‌ రోడ్లపై తాచుపాము హల్‌చల్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

 

నర్సుల ధర్నా
అనంతరం రేవంత్‌ రెడ్డి నివాసాన్ని నర్సింగ్‌ స్టాఫ్‌ ముట్టడించింది. తమకు కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని రేవంత్‌ నివాసం ధర్నా నిర్వహించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పోలీస్‌ అధికారులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

గాంధీ భవన్‌ ఎదుట..
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించారు. భవనం ఆవరణలోకి చొరబడి ప్రధాన ద్వారం ఎదుట మెట్లపై బైఠాయించారు. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తయి నెలలవుతున్నా ఇంకా తమకు అపాయింట్‌మెంట్‌ పత్రాలు ఇవ్వలేదంటూ వాపోయారు. మంత్రులు, అధికారులకు కలిసి విన్నవించినా ఫలితం లేదని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రక్రియను దాదాపు 90 శాతం ప్రక్రియను పూర్తి చేశారని అభ్యర్థులు తెలిపారు. నియామక పత్రాలు ఇస్తే అయిపోయే దానికి ఎన్ని నెలలు కొనసాగిస్తారని అభ్యర్థులు నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే తమకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News