Weight Loss: త్వరగా బరువుతగ్గాలి అనుకుంటున్నారా? ఆపిల్ ని ఇలా తింటే చాలు

Apple Diet : బరువు తగ్గడం కోసం ఫ్రూట్ డైట్ చాలామంది చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఆపిల్ తో కూడా బరువు తగ్గొచ్చు. క్యాలరీలు తక్కువ ఉండే ఆపిల్.. మనం త్వరగా బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కోసం ఆపిల్ ని బోలెడు విధాలుగా వాడొచ్చు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 3, 2024, 07:39 PM IST
Weight Loss: త్వరగా బరువుతగ్గాలి అనుకుంటున్నారా? ఆపిల్ ని ఇలా తింటే చాలు

Weight Loss Diet : రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.. అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. అది నూటికి నూరు శాతం నిజం. ఆపిల్ లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. క్యాలరీలు తక్కువ, పీచుపదార్థం ఎక్కువ ఉండే ఆపిల్ తో.. త్వరగా మనం బరువు కూడా తగ్గిపోవచ్చు. 

ఆపిల్ లో ఉండే సహజ చక్కర ఆకలిని తగ్గిస్తుంది. దానివల్ల జంక్ ఫుడ్ కి దూరంగా ఉండొచ్చు. ఇక ఆపిల్ లో ఉండే పోషకాల గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు.. ఆపిల్ ను వివిధ రకాలుగా చేసుకుని తినొచ్చు. మరి ఆ వివిధ రకాలు ఏమిటో ఒకసారి చూద్దాం

యాపిల్ పీనట్ బటర్:

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కి ఆపిల్స్ ని కొంచెం పీనట్ బటర్ తో కలిపి తింటే రుచితో పాటు.. కడుపు కూడా త్వరగా నిండిపోతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో వోట్స్ కూడా కలిపి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీంట్లో ఉండే పోషకాలు.. రోజు మొత్తం కావాల్సిన శక్తి ఇస్తాయి. వీటిని కలిపి స్మూతీలా చేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది. 

శాండ్విచ్:

మధ్యాహ్నంపూట కూడా భోజనం సమయంలో ఆపిల్ ను తీసుకోవచ్చు. ఆపిల్ పల్యా చేయడం లేదా.. చట్నీలా చేసుకోవడం లేదా.. సాండ్విచ్ లా చేసుకుని తిన్నా టేస్టీగా ఉండటమే కాకుండా.. బరువు తగ్గడంలో కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి.

ఆపిల్ స్వీట్:

ఆపిల్ లో ఉండే సహజ చక్కెర షుగర్ పేషెంట్ కి కూడా హాని చేయదు. ఇక తీయగా ఉండే ఈ ఆపిల్ తో.. స్వీట్స్ కూడా తయారు చేసుకుని తినొచ్చు. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు పంచదారకి బదులుగా ఆపిల్ గుజ్జు వేయడం వల్ల.. స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే పంచదార వెయ్యటంలేదు కాబట్టి కొలెస్ట్రాల్ కూడా పెరగదు. 

ఆపిల్ స్నాక్:

ఇక ఆపిల్ ని డైరెక్ట్ గా తిన్నా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఉండే పీచు పదార్థం మనకి త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. కాబట్టి రోజు మొత్తం మీద ఎప్పుడు ఆకలి వేసినా లేదా భోజనం చేసే ముందు లేదా తర్వాత కూడా ఆపిల్ ని తింటే మంచి ఆరోగ్యంతో పాటు బరువు కూడా త్వరగా తగ్గొచ్చు.

Also Read: Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News