తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజాగా 20 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 38 మంది, రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మూడో జాబితా విడుదలతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్ధుల సంఖ్య 86కి చేరింది. ఇంకా 33 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతూ మిగిలిన అభ్యర్ధుల విషయంలో కసరత్తు పూర్తి కాలేదని..వీలైంత తర్వలో తుది జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ మూడో విడత జాబితా :
* ఇబ్రహీంపట్నం- కొత్త అశోక్‌గౌడ్
* చేవేళ్ల- కంజరాల ప్రకాశ్
* నాంపల్లి- దేవర కరుణాకర్
* సికింద్రాబాద్- సతీష్‌గౌడ్
* కొడంగల్- నాగురావ్నామాజీ
*. మహబూబ్‌నగర్- పద్మజారెడ్డి
*పటాన్చెరు- కరుణాకర్‌రెడ్డి
*నల్గొండ- శ్రీరామోజీషణ్ముక
*నకిరేకల్- కె.లింగయ్య
* మహబూబాబాద్- హుస్సేన్‌నాయక్
* మధిర- శ్యామలారావు
* ఖమ్మం- ఉప్పల శారద
* అలంపూర్-రజనీ మాధవరెడ్డి
* ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి
* హుజూరాబాద్- పుప్పాల రఘు
* హుస్నాబాద్- చాడ శ్రీనివాస్‌రెడ్డి
* మెదక్- ఆకుల రాజయ్య
* నారాయణ్‌ఖేడ్- రవికుమార్‌రెడ్డి
* సంగారెడ్డి- రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
* వేములవాడ- ప్రతాప రామకృష్ణ
రెబల్స్ పై బీజేపీ గురి ..
మొత్తం 119 స్థానాల్లో 86 స్థానాల్లోనే అభ్యర్ధులను ప్రటించిన బీజేపీ.. మరో 33 స్థానాలు పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అన్ని స్థానాల్లో అభ్యర్ధులను ఒకే సారి ప్రకటించే ఆస్కారం ఉన్నప్పటికీ ...వ్యూహాత్మకంగా దశలవారీగా జాబితా విడదల చేస్తూ వస్తోంది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో టికెట్ రాని బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి టికెట్లు కేటాయించాలని బీజేపీ స్కెచ్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. అందుకే ఈ స్థానాలు పెండింగ్ లో పెట్టినట్లు వార్తు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.