Infinix Smart 8 Price: రూ.5వేల లోపే 64 GB స్టోరేజ్ మొబైల్.. ఇంతకంటే తక్కువ ధరకు మళ్లీ రాదు!

Infinix Smart 8 Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఓ సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 8 (Infinix SMART 8) మొబైల్ ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే ఈ మొబైల్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 09:36 AM IST
Infinix Smart 8 Price: రూ.5వేల లోపే 64 GB స్టోరేజ్ మొబైల్.. ఇంతకంటే తక్కువ ధరకు మళ్లీ రాదు!

 

Infinix Smart 8 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సెల్లు అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి అంతేకాకుండా వాటిపై బ్యాంక్ ఎక్స్చేంజ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చౌక ధరలోని స్మార్ట్ టీవీ లతోపాటు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని టెక్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ పై 40 శాతంకు పైగా తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో ఏ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అతి తక్కువ ధరతోనే ప్రీమియం ఫీచర్స్ తో మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవలే ఇన్ఫినిక్స్ బ్రాండ్ విడుదల చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 8 (Infinix SMART 8) మోడల్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్ పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ MRP ధర రూ.7,999 కాగా ప్రత్యేక సేల్ లో భాగంగా 21 శాతం తగ్గింపుతో రూ. 6,299 పొందవచ్చు. దీంతోపాటు ఈ మొబైల్ పై ఎక్స్ట్రా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.

Also read: Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 8 (Infinix SMART 8) స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లించితే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 630 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ ను కేవలం రూ. 5,669కే పొందవచ్చు. మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ని సందర్శించి ఇతర బ్యాంక్ ఆఫర్లను కూడా వినియోగించవచ్చు.

Also read: Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News