ప్రధాని గారూ.. పకోడి బండి పెట్టుకోవడానికి డబ్బులివ్వండి: తేజస్వి యాదవ్

భారత ప్రధాని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. రోడ్ల పక్కన పకోడీలు అమ్ముకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు.

Last Updated : Sep 16, 2018, 11:00 PM IST
ప్రధాని గారూ.. పకోడి బండి పెట్టుకోవడానికి డబ్బులివ్వండి: తేజస్వి యాదవ్

భారత ప్రధాని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. రోడ్ల పక్కన పకోడీలు అమ్ముకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఒకప్పుడు దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన మోదీ సర్కారు ఈ రోజు పకోడీలు అమ్ముకోమని చెబుతుందని.. రెండు కోట్లమంది కేవలం పకోడీలే అమ్ముకుంటే వాటిని తినేవారెవరని తేజస్వి ఎద్దేవా చేశారు.

ఒకప్పుడు నల్లధనం వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నారని.. అయితే తమకు అంత అవసరం లేదని.. మోదీ గారు చెప్పిన పకోడి బండి పెట్టుకోవడానికి కనీసం రూ.1 లక్ష ఇచ్చినా చాలని తేజస్వి సెటైర్లు విసిరారు. ఈ రోజు ఓ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన తేజస్వి.. దేశంలోని మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనను అడ్డుకోవడమే మహాకూటమి ప్రధాన ఎజెండా అని తెలిపారు. తాము నితీష్ కుమార్ తన తప్పు తెలుసుకున్నారని భావించామని.. కానీ ఆయన బీజేపీతో జత కట్టి మళ్లీ తప్పు చేశారని తేజస్వి తెలిపారు. 

నితీష్ కుమార్‌కి ప్రజల కన్నా తన సీఎం కుర్చీ అంటేనే మోజు అని.. అలాంటి వ్యక్తితో తాము కలిసి ముందుకు ఎలా వెళ్తామని తేజస్వి తెలిపారు. తన మీద కేసులు పెట్టినా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఒకానొక సందర్భంలో నితీష్‌‌కు మద్దతు ఇచ్చారని.. కానీ తనకు తన తండ్రిలాంటి గొప్ప మనసు లేదని.. తాను ఎప్పటికీ నితీష్‌కి మద్దతు ఇవ్వనని తేజస్వి తెలిపారు. 

Trending News